నేషనల్

గుజరాత్‌‌ ‘హజ్’లో ఇద్దరూ గెలిచారు!

గుజరాత్‌‌ ‘హజ్’లో ఇద్దరూ గెలిచారు!

గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే గుజరాత్ ఎన్నికల్లో ‘హజ్’గా పేరొందిన హార్థిక్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ త్రయంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన దళిత నేత జిగ్నేష్ సత్తా చాటారు. సమీప బీజేపీ అభ్యర్థి విజయ్ చక్రవర్తిపై 18,150 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎస్సీ క్యాటగిరీకి కేటాయించిన వడ్‌గామ్ నుంచి జిగ్నేష్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ జిగ్నేష్‌కు పరోక్షంగా మద్దతు తెలిపింది. రాదన్‌పూర్ నుంచి పోటీ చేసిన ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ కూడా గెలుపొందాడు. గుజరాత్‌లోని అతి పెద్ద నియోజకవర్గాలలో రాదన్‌పూర్ కూడా ఒకటి. ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తైవాన్ నుంచి అతి ఖరీదైన పుట్టగొడుగులు తెప్పించుకుని తినడం వల్లే నల్లగా ఉండే ఆయన రంగు మారారని వ్యాఖ్యలు చేసి అల్పేష్ ఠాకూర్ వార్తల్లో నిలిచారు. పటేళ్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం 25ఏళ్లు నిండి ఉండాలి. హార్థిక్ వయసు 24 సంవత్సరాలే కావడంతో ఆయన ఎన్నికల బరిలో నిలవలేదు.

To Top
error: Content is protected !!