కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
నేషనల్

కేంద్ర ఉద్యోగులకు మోడీ కొత్త సంవత్సర కానుక కనీస వేతనం, ఫిట్‌మెంట్‌ భారీగా పెంపు

pakistan media about modi visits
కేంద్ర ఉద్యోగులకు మోడీ కొత్త సంవత్సర కానుక కనీస వేతనం, ఫిట్‌మెంట్‌ భారీగా పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం జనవరి నుంచే వేతనాలు పెరగనున్నాయి. జనవరిలో మోదీ ప్రభుత్వం ఈ మేరకు తీపికబురు అందించనుంది. ఏడో వేతన సంఘ (7వ సీపీసీ) సిఫారసులకు అనుగుణంగా వారి కనీస వేతనాలను పెద్దఎత్తున సవరించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని కేబినెట్‌ గతవారం పెంచిన సంగతి తెలిసిందే. వేతన సంఘ సిఫారసుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములాకు లోబడే ఈ డీఏను పెంచింది. దీనికి అదనంగా ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ను 2.57 రెట్లు పెంచాలని వేతన సంఘం సిఫారసు చేయగా.. మూడు రెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కొత్త వేతనాలు జనవరి నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశముంది.
కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, ఫిట్‌మెంట్‌ను 3.68 రెట్లు పెంచాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సూచన మేరకు.. దానిని రూ.21 వేలకు పెంచాలని సిఫారసులు, వేతనాల్లో అంతరంపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ సిఫారసు చేయనున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై త్వరలోనే కేంద్రం ప్రకటన చేస్తుందని, వచ్చే జనవరి నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. వేతన సంఘం కనీస వేతనాన్ని రూ.7 వేల నుంచి రూ.18 వేలకు పెంచాలని, గరిష్ఠ వేతనాన్ని రూ.80 వేల నుంచి రూ.2.25 లక్షలకు, కేబినెట్‌ సెక్రటరీకి రూ.2.5 లక్షలు ఇవ్వాలని సిఫారసు చేసింది. వీటిని కేంద్రం ఇప్పటికే ఆమోదించి.. లోపాల సవరణకు పై కమిటీని నియమించింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!