కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
నేషనల్

ఒక్క అణు బాంబుతో జపాన్‌ను సముద్రంలో కలిపేస్తాం..కిమ్ వార్నింగ్

north korea president about america photos
ఒక్క అణు బాంబుతో జపాన్‌ను సముద్రంలో కలిపేస్తాం..కిమ్ వార్నింగ్

ఉత్తర కొరియా తన దుందుడుకు వైఖరిని కొనసాగిస్తూ మరింత రెచ్చగొడుతోంది. తాజాగా జపాన్‌పై అణుబాంబులతో దాడిచేసి సముద్రంలో ముంచేస్తామని హెచ్చరించింది. ఉత్తర కొరియా ప్రకటనతో తూర్పు ఆసియా దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతపెరిగాయి. ఇక మా దేశానికి సమీపంలో ఉండే అర్హత జపాన్‌కు ఎంత మాత్రమూ లేదని అని కొరియా అధికారిక న్యూస్ ఏజన్సీ గురువారం నాడు ఓ ప్రకటన వెలువరించింది. జపాన్‌కు చెందిన నాలుగు ద్వీపాలనూ తమ అణుబాంబుతో సముద్రంలో కలిపేస్తామని, తమను తాము కాపాడుకునేందుకు ఇదో మార్గమని పేర్కొంది.ఉత్తర కొరియా వ్యాఖ్యలపై జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ యోషిహైడ్ సుగా స్పందించారు. కొరియా రెచ్చగొట్టే ధోరణిలో ఉందని, ఇదే కొనసాగితే ప్రపంచంలోనే ఆ దేశం ఏకాకిగా మిగిలిపోతుందని హెచ్చరించారు. అలాగే అంతర్జాతీయ సమాజం ఉత్తర కొరియాపై మరింత ఒత్తిడి తెచ్చేలా విధానాలను మార్చుకోవాలని సూచించారు. సెప్టెంబరు 3 న ఓ శక్తిమంతమైన అణుబాంబుతోపాటు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని జపాన్ దీవి మీదుగా నార్త్ కొరియా పరీక్షించడంతో ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఖనిజాలు, ఇంధన ఎగుమతులను ఆ దేశానికి ఆపేయాలని, వారు తయారు చేసే దుస్తులను ఎవరూ దిగుమతి చేసుకోవద్దని అమెరికా ప్రతిపాదనలకు ఐరాస భద్రతామండలి సోమవారం ఆమోదించింది.
ఉత్తర కొరియా తాజా హెచ్చరికలు ఈ ప్రాంతంలో కొత్త ఉద్రిక్తతలు కలిగిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఐరాస ఆంక్షలతో గుర్రుగా ఉన్న ఉత్తర కొరియా అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలపై నిప్పులు చెరుగుతోంది. అయితే కొరియా వ్యాఖ్యల వెనుక రష్యా, చైనా హస్తం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కొరియా హెచ్చరికతో అప్రమత్తమైన జపాన్ తూర్పుతీరంలోని అమెరికా యుద్ధ నౌకను పరిశీలించింది. ఉత్తర కొరియా ప్రకటన జపాన్ స్టాక్ మార్కెట్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. నిక్కి స్టాక్ ఇండెక్స్ లాభాల బాటలో పయనించింది

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!