నేషనల్

ఐఫోన్ కి మనం 64000 చెల్లిస్తున్నాము..కానీ తయారీకి అయ్యే ఖర్చు ఎంత తక్కువో తెలుసా..?

manufacturing cost of apple iphone
ఐఫోన్ కి మనం 64000 చెల్లిస్తున్నాము..కానీ తయారీకి అయ్యే ఖర్చు ఎంత తక్కువో తెలుసా..?

యాపిల్ కంపెనీ. ఐఫోన్ల‌ను త‌యారు చేస్తారు క‌దా, అదే కంపెనీ. ఇంత‌కీ చెట్టు పేరు చెప్పి కాయ‌లమ్ముకోవ‌డం అనేది యాపిల్‌కు ఎందుకు వ‌ర్తిస్తుంది..?ఐఫోన్‌… దీని గురించి దాదాపుగా చాలా మందికి తెలుసు. ధ‌ర ఎక్కువ ఉంటుంద‌ని. ఇక దాన్ని వాడిన వారికైతే ఫీచర్స్ గురించి కూడా తెలుస్తాయ‌నుకోండి, అది వేరే విష‌యం. అయితే ఐఫోన్ విడుద‌లైన తొలి నాళ్ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వచ్చిన అన్ని మోడ‌ల్స్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయో అంద‌రికీ తెలుసు. సాధార‌ణ మొబైల్ వినియోగ‌దారులెవ‌రూ ఊహించ‌ని రేంజ్‌లో వాటి ధ‌ర‌లు ఉంటూ వ‌చ్చాయి. అంతెందుకు ప్ర‌స్తుతం విడుద‌లైన ఐఫోన్ 7 బేసిక్ మోడ‌ల్ (32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియెంట్‌) ధ‌ర ఎంతో తెలుసా..? అక్ష‌రాలా రూ.60వేలు. అక్టోబ‌ర్ 7న భార‌త మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. అయితే అస‌లు ఈ ఫోన్‌ను త‌యారు చేసేందుకు నిజంగా అంత ఖ‌ర్చ‌వుతుందా..? అందులో అంత కాస్ ఉందా..? ఇప్పుడు చూద్దాం…ఐఫోన్ 8 బేసిక్ మోడ‌ల్‌ను ఐహెచ్ఎస్ అనే ఓ టెక్ రీసెర్చ్ సంస్థ ఏ పార్ట్‌కి ఆ పార్ట్ విడ‌దీసి అందులో ఉన్న హార్డ్‌వేర్‌ను మొద‌ట గుర్తించింది. వాట‌న్నింటినీ విడి విడిగా పెట్టి ఒక్కో దాని ఖ‌రీదును లెక్కించింది. వాటి వివ‌రాలు ఇవిగో…
ఐఫోన్ 8ప్రాసెస‌ర్ ధ‌ర – 26.90 డాలర్లు
బేస్‌బ్యాండ్ ధ‌ర – 33.90 డాల‌ర్లు
బ్యాట‌రీ – 2.50 డాల‌ర్లు
బ్లూటూత్‌, వైపై, ఇత‌ర క‌నెక్టివిటీ డివైస్‌లు – 8 డాల‌ర్లు
కెమెరాలు – 19.90 డాల‌ర్లు
డిస్‌ప్లే – 43 డాలర్లు
యాంటెన్నా, క‌నెక్ట‌ర్లు, మైక్రోఫోన్‌, పీసీబీ, స్పీక‌ర్లు – 16.70 డాల‌ర్లు
సెమి కండ‌క్ట‌ర్లు – 1.30 డాల‌ర్లు
ఎన్‌క్లోజ‌ర్స్‌, లేబుల్స్‌, ఇన్సులేట‌ర్స్ తదిత‌రాలు – 18.20 డాల‌ర్లు
మెమోరీ (ర్యామ్‌, ఇంట‌ర్నల్ స్టోరేజ్‌) – 16.40 డాల‌ర్లు
ప‌వ‌ర్ మేనేజ్‌మెంట్ చిప్స్ – 7.20 డాల‌ర్లు
ఆడియో, ఎన్ఎఫ్‌సీ, సెన్సార్లు – 14 డాల‌ర్లు
లైటెనింగ్ కేబుల్‌, ఆడియో అడాప్ట‌ర్‌, హెడ్‌సెట్ క‌నెక్ట‌ర్‌, ఛార్జ‌ర్ – 11.80 డాల‌ర్లు
అసెంబ్లింగ్‌, టెస్టింగ్ – 5 డాల‌ర్లు
మొత్తం – 224.80 డాల‌ర్లు
అంటే మ‌న క‌రెన్సీ ప్ర‌కారం ఐఫోన్ 7 బేసిక్ మోడ‌ల్ త‌యారీకి అయ్యే ఖ‌ర్చు రూ.15,067.10 మాత్ర‌మే. దీనికి ఇత‌ర ప‌న్నులు క‌లిపినా మ‌రో రూ.3వేలు, రూ.4వేల‌కు ఎక్కువ కాదు. అయితే ఈ ఫోన్ మ‌న ద‌గ్గ‌ర ఎంత ధ‌ర‌కు ల‌భించ‌నుందో తెలుసా..? అక్ష‌రాలా రూ.60వేల‌కు. అంటే త‌యారీ క‌న్నా దాదాపుగా 4 రెట్ల ఎక్కువ ధ‌ర‌ను వెచ్చించి మ‌నం ఐఫోన్ 7 బేసిక్ మోడల్‌ను కొనుగోలు చేస్తాం అన్న‌మాట‌.
ఐఫోన్ల‌లో ఉండే ఫీచ‌ర్లు ఎలా ఉన్నా ముందు నుంచీ యాపిల్ ఐఫోన్ అంటే ఒక విలాస‌వంత‌మైన బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌గా మారిపోయింది. అది మొద‌ట్నుంచీ అలాగే ఉన్నా అస‌లు ఆ ఫోన్ల‌కు ఎందుకు అంత ఎక్కువ ధ‌ర అంటే ఇప్ప‌టికీ ఏ టెక్ విశ్లేష‌కుడూ, నిపుణుడూ స‌రిగ్గా చెప్ప‌లేడు. అది అంతే. ఐఫోన్ ధ‌ర అంతే ఉంటుంది లెండి. అని చెప్పడం త‌ప్ప ఎవ‌రూ ఈ ఎక్కువ ధ‌ర‌కు కార‌ణం స‌రిగ్గా చెప్పడం లేదు. స‌రే ఫీచ‌ర్లు బాగానే ఉంటాయి అని అనుకున్నా, మ‌రీ 4 రెట్ల ఎక్కువ ధ‌ర పెట్ట‌డం ఏంటండీ బాబూ..! ఐఫోన్ 7, 7 ప్ల‌స్‌. ఇక వీటిని అమ్మేందుకు యాపిల్ త‌న చెట్టు పేరును ఎంత‌గా వాడుకుంటుందో వేచి చూడాలిక‌. అయినా మ‌న పిచ్చి గానీ ఒక వ‌స్తువును గీచి గీచి బేర‌మాడి కొనే మ‌నం మ‌రీ అలాంటి వ‌స్తువుకు 4 రెట్ల ధ‌ర‌ను వెచ్చించి కొనుగోలు చేస్తామా ఏంటీ..? ఆలోచించండిmeree

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!