కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
నేషనల్

ఆ విషయం లో పాక్ భారత్ ఒకటే.. మోడీ కి షాక్ ఇచ్చిన ట్రాంప్

trump about India drugs
ఆ విషయం లో పాక్ భారత్ ఒకటే.. మోడీ కి షాక్ ఇచ్చిన ట్రాంప్

మిత్రదేశం అంటూ ఇప్పటివరకూ భారత్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సడన్ షాకిచ్చారు. ఉగ్రవాదులకు స్వర్గధామం అని ఏఏ దేశాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారో, ఇప్పుడు ఓ విషయంలో అదే దేశాల సరసన భారత్‌ను కూడా చేర్చారు. మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేసే టాప్-22 దేశాల లిస్ట్‌లో భారత్‌ను ఉంచారు. డ్రగ్స్ ఉత్పత్తి, అక్రమ రవాణా చేస్తున్న 22 ఆసియన్ దేశాల జాబితాను ట్రంప్ విడుదల చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బహమాస్, లతో పాటు భారత్‌ను కూడా ఈ లిస్ట్‌లో చేర్చి ఊహించని షాకిచ్చారు. ఓ ప్రాంత భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు డ్రగ్స్ అక్రమరవాణాకు దోహదం చేస్తాయని ఓ ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు. జాబితాలోని కొన్ని దేశాల్లో అధికార యంత్రాంగం డ్రగ్స్ రవాణాను అరికట్టలేకపోయాయని ఆయన విమర్శించారు. బొలీవియా, వెనుజులా దేశాలు యేడాది కాలంగా మాదకద్రవ్యాల అక్రమ సరఫరాను అడ్డుకోవడంలో విఫలమయ్యాయని దుయ్యబట్టారు. కొలంబియా కూడా తమ దేశం నుంచి ఇతర దేవాలకు అక్రమ సరఫరాను అరికట్టలేకపోయిందన్నారు. కాగా ట్రంప్ వెల్లడించిన ఈ 22 దేశాల జాబితాలో భారత్‌ను చేర్చడం చర్చనీయాంశమయింది. మిగిలిన దేశాలతో పోల్చితే భారత్‌లో డ్రగ్స్ ప్రభావం చాలా తక్కువ. అయినా కూడా పాక్ వంటి దేశాల సరసన భారత్‌ను చేర్చడం సగటు భారతీయులకు మింగుడుపడటం లేదు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!