వ్యాపారం

వరుసగా మూడోరోజు పెట్రోల్, డీజిల్ బాదుడు!

national petrol and diesel price rise for the third consecutive day
వరుసగా మూడోరోజు పెట్రోల్, డీజిల్ బాదుడు!

రోజురోజుకు ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తగ్గిస్తున్నట్లు ఒకసారి చెప్పి మూడుసార్లు పెంచుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ ధరలోనే వస్తున్నా , పెట్రోల్ , డీజిల్ ధరలు పెరుగుతూనే వున్నాయి.

సామాన్య మానవుడు కొనలేని పరిస్థితి. ఇలా పెంచుకుంటూ పొతే భవిష్యత్లో సామాన్యులు బ్రతకదమ్ కష్టమే..వరుసగా రెండు రోజులు పెంచిన ధరలు మూడోరోజూ పెంచారు.

ఇటీవల కాలంలో క్రమంగా తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు గత మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు కూడా లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు, లీటర్ డీజిల్ ధర 29 పైసలు పెరిగాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69కు, డీజిల్ ధర రూ. 63.10కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 75, డీజిల్ ధర రూ. 66కు చేరుకుంది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.41కి, డీజిల్ ధర రూ. 68.57కి పెరిగాయి.

To Top
error: Content is protected !!