సినిమా

నాని చేతిలో బిగ్ బాస్ ఎలిమినేషన్ లిస్ట్!

నాని చేతిలో బిగ్ బాస్ ఎలిమినేషన్ లిస్ట్!

బిగ్ బాస్ 2 సీజన్ మెళ్లిగా హీట్ పెంచుతోంది. భారీ అంచనాలతో మొదలైన షో నెమ్మదిగా ఆసక్తి పెంచుతోంది. కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ షోలో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో కొందరు అస్సలు కలువడం లేదు. దీంతో ఇద్దరి ఎలిమినేషన్ కు రంగం సిద్ధం అవుతోంది. ఈ వారాంతంలో ఇద్దరినీ బిగ్ బాస్ ఇంటి నుంచి పంపించడానికి సిద్ధమయ్యారు. ఇక రీసెంట్ గా జరిగిన నాలుగో రోజు పరిణామాలు ఆసక్తిగా మారాయి. సంజన జైల్లోంచి రావడంతోనే ప్రతీకారం మొదలు పెట్టింది. బాబూ గోగినేనిని టార్గెట్ చేయడం.. ఆయన దానికి సీరియస్ కావడంతో షో రసకందాయంలో పడింది. మిగిలిన అందరూ సెలబ్రెటీల కన్నా హేతువాది గోగినేని బాబుపైనే ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన సైంటిఫిక్ గా.. మానవీయ కోణంలో ఆలోచిస్తూ పలువురు తోటి కంటెస్టెంట్లకు వివరిస్తున్న తీరు ఆసక్తి రేపుతోంది. అంతేకాదు.. బిగ్ బాస్ పైన.. తోటి సభ్యులపైన శృతిమించితే వార్నింగ్ లు ఇస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతున్నారు. ఇక షోలో తేజస్వి, గీతామాధురి కూడా ఆసక్తి రేపుతున్నారు. సందడిగా ప్రవర్తిస్తూ షోలో ఆకట్టుకుంటున్నారు.., ఇక ఎలిమినేషన్ ప్రక్రియ అత్యంత ఆసక్తి రేపింది. ఒక్కొక్కరిని సీక్రెట్ రూంకు పిలిచిన బిగ్ బాస్ ఎవరినీ ఇంటినుంచి బయటకు పంపాలో అడిగాడు. ఒక్కొక్కరు ఇద్దరు పేర్లను చెప్పారు. ఈ ప్రక్రియలో ఎక్కువమంది దీప్తి సునయన, గణేష్, కిరీటీ, కౌశల్, సంజన పేర్లు ప్రతిపాదించారు. వీరిలో అందరిపై ఫైర్ అవుతున్న సంజన, దీప్తి సునయన, గణేష్ కి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నట్టు అర్థమవుతోంది. వీరి ముగ్గురిలో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో దీప్తి సునయన, గణేష్ మిగతా కంటెస్టెంట్లతో కలిసిపోవడం లేదని ఇంటి సభ్యులు బిగ్ బాస్ కు చెప్పారు. ఇక కిరీటీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని నామినేట్ చేశారు. ఈ ఐదుగురిలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే చాన్సుంది. మొత్తానికి మూడోరోజు నుంచి బిగ్ బాస్ 2 గొడవలు, వాదులాటలతో ఆసక్తి పెంచుతోంది.

To Top
error: Content is protected !!