సినిమా

నానువ్వే రివ్యూ …, కళ్యాణ్ రామ్ ఇరగదీసాడు!

నానువ్వే రివ్యూ ..., కళ్యాణ్ రామ్ ఇరగదీసాడు!

రొటీన్ రోత సినిమాల నుండి బయటపడేందుకు కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేస్తున్నారు. తనలో దాగిన లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్‌ని తమన్నా కోసం ఇన్నాళ్లకు బయటకు తీశారు అదే ‘నా నువ్వే’ మూవీ ద్వారా. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం ‘నా నువ్వే’ మంచి అంచనాలతో గురువారం నాడు (జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించిందో మనం ఈ రివ్యూలో చూద్దామా …,

కథ కథనం విశ్లేషణ ..,

ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతూ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌డంతో సినిమాపై భారీగానే అంచ‌నాలు పెరిగాయి. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్, ప్రమోషన్‌ సాంగ్స్ సినిమా పై పెంచిన హైప్ ని సినిమాను చూసిన ప్రేక్షకుల్లో కూడా అదే ఆహ్లాదాన్ని అందించింది ఏఈ సినిమా అని చెప్పొచ్చు .., దీనికి ప్రధాన కారణం అతికొద్ది సినిమాల్లో మాత్రమే సినిమా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ సినిమా తెరపై వర్క్ అవుట్ అవుతుంది …అలాంటిది ఈ నా నువ్వే లో కూడా నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయింది …, .. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువ‌ల్స్‌ తో వారిని కళ్యణ్ రామ్ తమన్నాలు ఎన్నో సినిమాలో నటించిన కూడా మనకు కొత్త ఫ్రెష్ పెయిర్ లా అనిపిస్తారు .., ఇక శ‌ర‌త్ అందించిన మెలోడియ‌స్ ఆల్బమ్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిలుస్తున్నాయి. ఆల్‌రెడీ విడుద‌లైన సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమా విడుదలకి ముందు క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జోడి పై ఎన్నో అనుమానాలు వున్నా కానీ సినిమా చుసిన వారికి మాత్రం , ఈ జోడి బలే నచ్చేస్తుంది .., మొత్తానికి ఈ సినిమా క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు …తమన్నా, కళ్యాణ్ రామ్ కెరియర్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ తో ఈ సినిమా చుసిన ప్రతి ప్రేక్షకుడు చాలా కూల్ ఫీలింగ్ తెప్పిస్తుంది .., దర్శకుడు చాలా హానెస్ట్‌‌గా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు … ఎక్కడ స్క్రీన్ ప్లే లో తప్పటడుగులు వేయకుండా మంచి ఫేస్ లో సినిమాను కొనసాగించిన వైనం ఈ సినిమాకి ప్రాణ హాయ్ లైట్ అని చెప్పొచ్చు ..,
ఇదో అందమైన ప్రేమ కథలో తమన్నా తన అందాలను ఒలకబోస్తూ రెచ్చిపోవడమే కాకుండా .., తన హాట్ డాన్సు మూమెంట్స్ తో కుర్రకారుని పిచ్చెకించింది ..,కళ్యాణ్ రామ్ , తమన్నాల మధ్యలో వచ్చే రొమాంటిక్ సీన్స్ మరో హైలైట్ గా నిలుస్తాయి .., అద్భుతమైన సాంగ్స్ పిక్చరైజేషన్ , మంచి స్క్రీన్ ప్లే , చిన్న క్లైమాక్స్ ట్విస్ట్‌తో అందమైన ముగింపు ఇచ్చారు దర్శకుడు . ఓవరాల్‌గా ‘నా నువ్వే’ మంచి రొమాంటిక్ విజువల్ ట్రీట్ గా నిలుస్తుంది .. ఈమూవీకి మా యోయో టివి ఇటున్న రేటింగ్ 3. 25 ఔట్ అఫ్ 5

To Top
error: Content is protected !!