తెలంగాణ

మల్కాజిగిరి లో టీఆరెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు?

MP venugopal as malkajgiri MP contest for TRS party
మల్కాజిగిరి లో టీఆరెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు?

తెలంగాణలో ఇటీవల ముందస్తు ఎన్నికలకు వచ్చిన టీఆరెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించింది . గతంలో ముందస్తున్న ఎన్నికలకు వచ్చిన నేతలు ఎవరు గెలవలేదు కానీ కేసీఆర్ మాత్రం గెలిచి ఒక చరిత్ర సృష్టించారు .

దింతో తెలంగాణ ముఖ్యమంత్రిగా గులాబీ దళపతి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టారు .అనంతరం దేశంలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బిజెపి యేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తానని ప్రకటించాడు .

ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతీయ పార్టీ నేతలతో చర్చలు జరిపారు .ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు 16 స్థానాలు దక్కించుకుంటే ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు .

ఈ తరుణంలో లోక సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు . అయితే గతంలో లోక సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులనే ఈ సారి కూడా బరిలోకి దింపాలని భావిస్తున్నారు .

కానీ కొన్ని స్థానాల్లో మాత్రం కొత్త అభ్యర్థులు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది .వాటిలో పెద్దపల్లి , మల్కాజిగిరి స్థానాలు ఉన్నాయి . గతంలో ఇక్కడ నుండి పోటీ చేసిన బాల్క సుమన్ , మల్లారెడ్డి లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు .

దింతో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు . పెద్దపల్లి లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు . కానీ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసారని కొప్పుల ఈశ్వర్ లాంటి నేతలు కేసీఆర్ కు పిర్యాదు చేశారు .

దింతో వినోద్ పేరు పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తుంది . ఇక అదే సమయంలో మల్కాజిగిరి నుండి ఎవరిని పోటీ చేపించాలని కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు . అయితే ఇక్కడ నుండి వేణుగోపాల చారిని బరిలోకి దింపాలని కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారు ..

గతంలో టిడిపి హయాంలో వేణుగోపాల చారి కేంద్రమంత్రిగా చేశారు . తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేణుగోపాల్ టీఆరెస్ గూటి చేరారు . ఆయన టిడిపి నుండి టీఆరెస్ లో చేరే సమయంలో రాజ్యసభ కు పంపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తుంది .

కానీ ఆయనకు ఇప్పటివరకు పదవులు ఏమి రాలేదు . ఇక ప్రస్తుతానికి వేణుగోపాల్ ఢిల్లీలో టీఆరెస్ ప్రీతినిధిగా కొనసాగుతున్నారు . దింతో వచ్చే లోక సభ ఎన్నికల్లో వేణుగోపాల్ చారిని మల్కాజిగిరి నుండి బరిలోకి దించాలని టీఆరెస్ అధిష్టానం భావిస్తుంది .

అలాగే మల్కాజిగిరిలో బ్రాహ్మణ సామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్నారు . అదే సమయంలో వేణుగోపాల చారి ని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేపించడం ద్వారా బ్రాహ్మణ సామాజికర్గానికి కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ వ్యూహం రచిసున్నట్లు తెలుస్తుంది .

కాగా అభ్యర్థులను ఎంపిక చేయడంలో రాటుతేలిన కేసీఆర్ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో వేణుగోపాల చారినే బరిలోకి దింపుతారా లేదా మరొకరికి అవకాశం ఇస్తారా అన్నది తెలియాలంటే కొన్ని రోజులవరకు వేచిచూడాల్సిందే మరి

To Top
error: Content is protected !!