తెలంగాణ

రేవంత్ కు భ‌య‌ప‌డుతున్న బాబు.. ?

mothukpally narasimhulu comments on chandrababu naidu and ttdp
రేవంత్ కు భ‌య‌ప‌డుతున్న బాబు.. ?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎవ‌రు ఎలాంటి కామెంట్ల‌యినా చేయొచ్చు. అర్ధం ప‌ర‌మార్ధం వారికే ఎరుక! అన్న రేంజ్‌లో ఇప్పుడు రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. తెలంగాణ కు చెందిన టీడీపీ మాజీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నార‌ని.. ప్ర‌స్తుతం బాబుపై పీక‌ల్లోతు ఆగ్ర‌హంతో ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు తెలంగాణ‌, ఏపీల్లోనూ సంచ‌ల‌నంగా మారాయి. వాస్త‌వానికి.,. “నేను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ను… న‌న్ను ఎవ‌రూ భ‌య‌పెట్ట‌లేరు“ అని ప‌దే ప‌దే అంటున్న చంద్ర‌బాబుకు ఈ ప‌రిణామం శ‌రాఘాతంగా ప‌రిణ‌మించింది.గ‌త రెండున్న‌రేళ్ల కింద‌ట తెలంగాణ‌లో చోటు చేసుకున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓటుకు నోటు వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. అప్ప‌ట్లో ఆ కేసు తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. ఇక‌, సీన్ క‌ట్ చేస్తే.. చంద్ర‌బాబు.. భ‌య‌ప‌డుతున్నారంటూ.. మోత్కుపల్లి తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయారు. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో మోత్కుప‌ల్లి కామెంట్ల‌కు ప్రాధాన్యం పెరిగింది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినందుకే తనను అప్ప‌ట్లో అవమానాల పాలు చేశారని మోత్కుపల్లి ఆరోపించారు. `రేవంత్ రెడ్డిని చంద్రబాబు నమ్మారు.. ఏమైంది? ఓ పనికిమాలిన వ్యక్తిని నమ్మి పార్టీని నాశనం చేశారు. తెలంగాణలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతుంది`అని మోత్కుపల్లి పేర్కొన్నారు.
“రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుల వల్ల పార్టీ తెలంగాణలో నాశనమైంది. రమణను సైలెంట్ చేసి సీఎంగా నిన్న గాక మొన్న వచ్చిన రేవంత్ ను ఫోకస్ చేశారు. మీ పేరు బొమ్మ లేకుండా ప్రోగ్రాం చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?’’ అని మోత్కుప‌ల్లి ప్ర‌శ్నించారు. “ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా మనం తయారు చేసిన నాయకుడు దొరికితే చర్యలు ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకుంటే.. రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారుతా అని బెదిరిస్తున్నాడని భయపడుతున్నారట నిజమేనా“ అంటూ మోత్కుపల్లి నిప్పులు చెర‌గ‌డం టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జ‌రిగిన ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని.. హైద‌రాబాద్‌లో మాట్లాడిన మోత్కుప‌ల్లి.. టీ-టీడీపీ పూర్తిగా భ్ర‌ష్టు ప‌ట్టిపోయింద‌ని, దీనిని వేరే ఏ పార్టీలోనైనా విలీనం చేయ‌డం మంచిద‌ని.. పూర్తిగా ప‌రువు పోగొట్టుకోక ముందే పార్టీనివిలీనం చేయ‌డం ద్వారా బ్ర‌తికించుకోవాల‌ని అప్ప‌ట్లోనే మోత్కుప‌ల్లి సూచించాడు. ఈ ప‌రిణామం తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే బాబు.. మోత్కుప‌ల్లిని ప‌క్క‌న పెడుతూ వ‌చ్చారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో మ‌హానాడు నిర్వ‌హించినా మోత్కుప‌ల్లికి ఆహ్వానం అంద‌లేదు. దీంతో మోత్కుప‌ల్లి పార్టీని మ‌రింత బ‌ద్నాం చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

To Top
error: Content is protected !!