ఆంధ్ర ప్రదేశ్

జేసీ వెర్సెస్ పిసి-ముదిరిన వైరం!

MLA Prabhaker Chowdary Vs JC Diwakar reddy war of words
జేసీ వెర్సెస్ పిసి-ముదిరిన వైరం!

పేరుకు ఇద్దరూ ఒకే పార్టీ. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. పందులు – కుక్కలు అని తిట్టుకుంటారు. ఎవ్వరికి ఎవ్వరూ తగ్గరు. వాళ్లే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి – ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.జేసీ దివాకర్ రెడ్డి – ప్రభాకర్ చౌదరి మధ్య ఎన్నాళ్ల నుంచో వైరం ఉంది. గతంలో జేసీ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్లు.

అప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత జేసీ టీడీపీలో చేరారు.. అప్పటినుంచి ఇద్దరి మధ్య వైరం రాజుకుంటూనే ఉంది. ఇక అనంతపురంలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా.. దానికి ఇద్దరూ రావడం – ప్రోటోకాల్ విషయంలో గొడవ పడడం ప్రతీసారి జరుగుతూనే ఉంది. ఇప్పటికే చంద్రబాబు చాలాసార్లు చెప్పి చూసినా.. ఎవ్వరికీ ఎవరూ తగ్గడం లేదు. దీంతో.. చంద్రబాబు కూడా జేసీ – పీసీని వదిలేశారు.

ఇక రెండు రోజుల క్రితం ప్రభాకర్ చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ జేసీ. పట్టణంలో పందులు – కుక్కలు అనంతపురంలో ఎక్కువైపోయారంటూ పరోక్షంగా ప్రభాకర్ చౌదరిని ఉద్దేశించి విమర్శలు చేశారు. దీనికి ప్రభాకర్ చౌదరి కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. పందులు – కుక్కలు అనంతపురంలోనే కాదు తాడిపత్రిలోనూ ఉంటాయని అన్నారు. వీటిని తరిమికొట్టే బాధ్యత మున్సిపాలిటీ చూసుకుంటుంది అని ఎద్దేవా చేశారు.

పెద్దాయన – ఇక్కడికి వచ్చి కుక్కలను తరిమికొడతానంటే అయన్ను ఇతర కార్పొరేటర్లందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. పిచ్చికుక్కలు తరిమికొట్టే పనిని తాము కూడా స్వాగతిస్తామన్నారు. అభివృద్ధి నిరోధకులు – దృష్టశక్తులెవరో అన్న ఆయన్నే అడగాలని విలేకరులకు సూచించారు.

అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా తప్పేనని – అలాంటివారిని తరిమికొట్టాల్సిందేనని పిలుపునిచ్చారు. ఒకే పార్టీలో ఉంటూ ఇలా దుమ్మెత్తిపోసుకోవడం వల్ల పార్టీకి నష్టం రాదా అని మీడియా ప్రశ్నించగా తమ మధ్య సమన్వయం పార్టీ చూసుకుంటుందని అన్నారు. మొత్తానికి ఆధిపత్య పోరులో పీసీ – జేసీ ఇద్దరూ తగ్గడం లేదు.

To Top
error: Content is protected !!