అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
తెలంగాణ

చంద్రబాబు నువ్వు మొగాడివైతే రా.. విరుచుకుపడ్డ తలసాని

చంద్రబాబు నువ్వు మొగాడివైతే రా.. విరుచుకుపడ్డ తలసాని

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరోమారు టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. తెలంగాణలో గెలిచే స్థానాలపై తన రాష్ట్ర పోలీసులతో బాబు సమాచార సేకరణ చేస్తున్నారనే వార్త మీడియాలో వచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్గాలు విరుచుకుపడ్డాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా చంద్రబాబు కాంగ్రెస్ తో జత కడుతున్నారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

`టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ఆరు నెలల క్రితమే కుదిరింది. పొత్తు పర్యవసానాలను చంద్రబాబు రాబోయే రోజుల్లో అనుభవిస్తారు. పొత్తుల మూలంగా తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ లో బాబు భారీ మూల్యం చెల్లించుకుంటారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో డ్రామాలు నడుస్తున్నాయి. చంద్రబాబు చిన్న విషయాన్ని చిలవలు – పలవలు చేస్తున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు అమిత్ షాకు లేదు. కేంద్రంలో అధికార బీజేపీ.. రిజర్వేషన్ల బిల్లును ఎందుకు ఆమోదించలేదు? బీజేపీ ఉన్న ఐదు స్థానాల్లో గెలిస్తే మహా గొప్ప. బీజేపీ – టీడీపీ – కాంగ్రెస్ పార్టీలకు క్యాడర్ లేదు` అని మంత్రి తలసాని ఆరోపించారు.

తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలి.. కానీ దొంగలా రావొద్దని టీఆర్ ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు సవాల్ చేశారు. `చంద్రబాబు బతుకంతా దొంగ రాజకీయాలే. బాబు విచ్ఛిన్నకర కుట్రలను ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజమంతా రెడీగా ఉందిఅని తలసాని విరుచుకుపడ్డాడు ….,

To Top
error: Content is protected !!