సినిమా

చిరు అల్లుడు పుట్టిన రోజున సంచలన నిర్ణయం!

మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ఇటీవలే ‘విజేత’ అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. సినిమాతో విజేత అవ్వలేక పోయిన కళ్యాణ్ దేవ్ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా – విజేతగా ప్రశంసలు పొందుతున్నాడు. నేడు కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు. పుట్టిన రోజు సందర్బంగా సన్నిహితులకు పార్టీలు ఇచ్చే వారిని చూశాం.

కాని కళ్యాణ్ దేవ్ మాత్రం తన అవయవాలను దానం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. అందుకోసం అపోలో హెల్త్ కేర్ వారికి బాండ్ కూడా రాసి ఇచ్చాడు. చనిపోయిన తర్వాత అవయవాలను మట్టిలో కలిపేయకుండా అవయవదానం ఇవ్వాలంటూ ఎన్నో స్వచ్చంద సంస్థలు పిలుపునిస్తున్నాయి. కాని పెద్దగా జనాలు ఆసక్తి చూపడం లేదు.

కళ్యాణ్ దేవ్ ఈ పనికి ముందుకు రావడం నిజంగా హర్షనీయం. ఆయన రియల్ హీరో అనిపించకున్నాడు అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు.

మరో వైపు పుట్టిన రోజు సందర్బంగా ట్విట్టర్ లో కూడా కళ్యాణ్ దేవ్ ఎంట్రీ ఇచ్చాడు. తాను చేసిన అవయవదానం గురించిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెళ్లడించాడు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ రెండవ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Kalyan Dev did a good thing on his birthday
To Top
error: Content is protected !!