క్రీడలు

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన క్రికెటర్-ఎవరో తెలుసా ?

క్రికెట్ లో కొనసాగిన కొందరు వ్యక్తులు రాజకీయాల్లో కూడా తమదైన ముద్ర వేసుకుంటున్నారు .. క్రికెట్ రంగంలోనే రికార్డులను తిరగరాసిన సచిన్ ప్రజలకు సేవచేయడానికి రాజ్యసభ్యుడు గా పని చేశారు ..

అలాగే ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీం కు కెప్టెన్ గా కొనసాగిన ఇమ్రాన్ ఖాన్ కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని మంత్రి అయ్యారు ..

కాగా అదే కోవలో బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ కూడా వచ్చాడు . బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అక్కడ అధికార అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ టీమ్ కెప్టెన్ మష్రఫే మోర్తాజా అవామీ లీగ్ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించాడు.

నరెయిల్-2 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మోర్తాజాకు 2,74,418 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థికి కేవలం 8,006 ఓట్ల మాత్రమే వచ్చాయి. బంగ్లాదేశ్ తరపున మోర్తజా 36 టెస్టులు, 202 వన్డేలు, 54 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 78, వన్డేల్లో 258, టీ20ల్లో 42 వికెట్లను పడగొట్టాడు. టెస్టుల్లో 797, వన్డేల్లో 1,728, టీ20ల్లో 377 పరుగులు సాధించాడు.

To Top
error: Content is protected !!