నేషనల్

అభినందన్ విడుదల తర్వాత దాడులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మమత!

Mamata welcomes IAF pilot's home coming
అభినందన్ విడుదల తర్వాత దాడులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మమత!

మనదేశ రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ..సామాన్య స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు ఆమె …అయితే తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ..తన ప్రతిష్టను తానే తగ్గించుకుంటున్నారు .. అందరూ ఒకదారి యితే .. తానొక్కత్తినే మరొక దారి అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇక మోదీ ప్రభుత్వం అంటే ఒంటికాలిపై లేస్తున్నారు .

ఆయన విధానాల వల్లే దేశం నాశనం అయిపోతుందని ఆరోపిస్తు… అవకాశం వస్తే థర్డ్ ఫ్రంట్ కి నేతృత్వం వహించి ప్రధాన మంత్రి కూడా కావాలని అనుకుంటున్నారు . అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్రానికి చుక్కలు చూపించే ప్రయత్నం చేసే ఆమె ..తాజాగా ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. మన యుద్ధ విమానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాడులు చేశాయని చెప్తున్న కేంద్రం.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు.

ఆమె మాట్లాడుతూ ..మన యుద్ధ విమానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి వెళ్లి దాడులు చేసి దాదాపు 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు చనిపోయారని చెప్తోంది. దానికి ఏవైనా ఆధారాలు అంటే ఫోటోలు – వీడియోలు ఏమైనా ఉన్నాయి. మన విమానం కూలిపోయిన అభినందన్ పాకిస్తాన్ లో పడిపోయాడు. వాళ్లు వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత అభినందన్ ను రిలీజ్ చేశారు.

పాకిస్తాన్ చెప్పినదానికి ఆధారాలు ఉన్నాయి. కానీ మీరు చెప్తున్నదానికే ఆధారాలు లేవు.అందుకే ఆధారాలు కావాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎలాంటి దాడులు చేయకుండా.. అటవీ ప్రాంతంలో బాంబులు వేసొచ్చి.. వాటిని మీ గొప్పలుగా చెప్పుకుంటున్నారని మాకు అనుమానం వస్తోంది. అందుకే.. ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తున్నా” అన్నారు మమతా బెనర్జీ. చాలామంది లీడర్ల మనసులో ఇదే అభిప్రాయం ఉంది.

కానీ ఎవ్వరూ బయటపడలేదు. దీదీ మాత్రం నిర్మొహమాటంగా కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అయితే దేశ రక్షణ , భద్రత వ్యవహారాల్లో ఆధారాలు చూపాలని కోరడంపై మమత విమర్శలు ఎదుర్కొంటున్నారు .. పాక్ యుద్ధ విమానాలను కూల్చే ప్రయత్నంలో ..అభినందన వారికి చిక్కడం .. పలు వీడియోలు విడుదలవడం అందరు చూశారు .ఎట్టకేలకు అభినందన్ క్షేమంగా వచ్చారని ప్రజలు సంబరపడుతున్న తరుణంలో మమత ఇలా వ్యాఖ్యానించడం సమంజసం కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి .

To Top
error: Content is protected !!