సినిమా

50 కోట్ల క్లబ్ లోకి చేరిన ‘మజిలీ’ సినిమా కలెక్షన్స్

majili movie collections reached 50 crores
50 కోట్ల క్లబ్ లోకి చేరిన 'మజిలీ' సినిమా కలెక్షన్స్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య మరియు సమంత జంటగా నటించిన ‘మజిలీ’ చిత్రం, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన మజిలీ సినిమా, తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. మజిలీ సినిమా తొలిరోజు వసూళ్లు చూసి, 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని చాలామంది అనుకున్నారు. అయితే అనుకున్నట్టుగానే ఈ సినిమా చాలా తేలికగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

కొంతకాలంగా నాగ చైతన్య సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అలాంటి హిట్ ఆయనకి ఈ మజిలీ సినిమాతో లభించడం విశేషం. చైతూ కెరియర్లో ఇంత త్వరగా అత్యధిక వసూళ్లను సాధించి 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన చిత్రంగా ‘మజిలీ’ నిలిచింది.

సమంత, నాగ చైతన్య పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా అవ్వడం తో అందరు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ మజిలీ సినిమాతో కథానాయికగా పరిచయమైన దివ్యాన్షకి కూడా మంచి మార్కులు పడిపోయాయి. ఈ అమ్మాయికి ఇక్కడ వరుస అవకాశాలు రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

To Top
error: Content is protected !!