సినిమా

‘మహర్షి’ అమెరికా టూర్ రద్దు!

'మహర్షి' అమెరికా టూర్ రద్దు!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ అమెరికా షెడ్యూల్ వాయిదా పడినట్టు సమాచారం. కొన్ని కారణాల వల్ల అమెరికా ప్రయాణం రద్దైందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ను డెహ్రాడూన్ లో ముగించుకుంది. 25 రోజుల షెడ్యూల్ కోసం అమెరికాకు వెళ్లాల్సిన తరుణంలో… వీరి ప్రయాణం రద్దైంది.

ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినిదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. మహేష్ బాబు యొక్క 25వ చిత్రం కావడంతో… ‘మహర్షి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది.

To Top
error: Content is protected !!