అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
క్రీడలు

లార్డ్స్ టెస్టు: ఇంగ్లాండ్‌ 396/7 డిక్లేర్డ్‌,ఇండియా 0/1

లార్డ్స్ టెస్టు: ఇంగ్లాండ్‌ 396/7 డిక్లేర్డ్‌,ఇండియా 0/1

ఇంగ్లాండ్‌ 396/7 డిక్లేర్డ్‌ ఆతిథ్య జట్టు ఆధిక్యం 289 పరుగులు లార్డ్స్‌: క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లాండ్‌ 396/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత్‌పై 289 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆల్‌రౌండర్‌ క్రిస్ వోక్స్‌ (137 నాటౌట్‌; 177 బంతుల్లో 21×4) అజేయంగా నిలిచాడు. నాలుగో రోజు, ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 357/6తో బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడింది. అంతకు ముందు రోజు స్కోరుకు అదనంగా 39 పరుగులు జోడించింది. ఆధిక్యాన్ని 289కి పెంచుకుంది. ఉదయం నుంచి క్రిస్‌వోక్స్‌ చక్కని షాట్లతో అలరించాడు. మరో ఆల్‌రౌండర్, నైట్‌ వాచ్‌మన్‌ శామ్‌ కరన్‌ (40; 49 బంతుల్లో 5×4, 1×6) దూకుడుగా ఆడాడు. అద్భుతమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు వేసిన మహ్మద్‌ షమిని చక్కగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో వేగంగా ఆడుతూ హార్దిక్‌ పాండ్య వేసిన 88.1వ బంతికి భారీ షాట్‌ ఆడబోయి ఫీల్డర్‌ షమికి చిక్కాడు. దాంతో జోరూట్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.

ఏడో స్థానం, అంతకన్నా దిగువన వచ్చి బ్యాటింగ్‌ చేసి భారత్‌పై అత్యధిక పరుగులు (125) చేసిన ఇంగ్లాండ్‌ ఆటగాడిగా క్రిస్‌వోక్స్‌ నిలిచాడు. ఆదివారం లార్డ్స్‌లో వాతావరణం మేఘావృతమై ఉంది. మరీ ఎండ కాయడం లేదు. బంతి స్వింగ్‌ అయ్యే అవకాశాలున్నాయి.

మరోసారి అండర్సన్‌, స్టుబర్ట్‌ బ్రాడ్‌ చెలరేగితో భారత్‌కు కష్టమే. పైగా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ వెన్ను నొప్పితో బాధపడుతుండటం గమనార్హం.

To Top
error: Content is protected !!