అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
నేషనల్

మోడీ ఫిటెనెస్ చాలెంజ్-తిరిగి కుమార స్వామి కౌంటర్!

ఇటీవల కేంద్ర క్రీడల శాఖామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ లో భాగంగా వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే.. తాను చేయడమే కాకుండా ట్విట్టర్ లో పోస్టు చేసి విరాట్ కోహ్లీ, హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్ కు ట్యాగ్ చేశారు. అయితే కేంద్ర క్రీడల మంత్రి ట్వీట్ కు స్పందించిన విరాట్ తాను చేస్తున్న వ్యాయామాల వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అంతేకాకుండా తన భార్య అనుష్కశర్మ ప్రధాని నరేంద్రమోడీ మహేంద్రసింగ్ ధోనిలను ఈ చాలెంజ్ స్వీకరించాలంటూ ట్యాగ్ చేశారు.
ఇటీవల కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ చాలెంజ్ ను స్వీకరించిన ప్రధాని మోడీ తాజాగా తన ఫిట్ నెస్ ప్రాక్టీస్ ను వీడియో తీసి పోస్టు చేశారు. ఈ ఉదయం వేశ ఎక్సర్ సైజ్ చేస్తూ.. ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో తాను ప్రేరణ పొందానని సోషల్ మీడియాలో మోడీ పోస్టు చేశారు.. ఇలా చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందని.. శ్వాసకు సంబంధించిన కసరత్తులు చేస్తానంటూ తన పోస్టులో పేర్కొన్నారు. మనం ఫిట్ గా ఉంటేనే దేశం ఫిట్ గా ఉంటుందంటూ తెలిపారు.
అనంతరం ప్రధాని మోడీ కూడా పలువురికి ఫిట్ నెస్ చాలెంట్ చేశాడు. కర్ణాటక ముఖ్యమంత్రి జేడీఎస్ నేత హెచ్.డీ కుమారస్వామికి ప్రధాని మోడీ ఫిట్ నెస్ చాలెంజ్ విసిరాడు. 2018 కామెన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన మానికా బాత్రా తోపాటు 40 ఏళ్లకు పైబడిన ఐపీఎస్ అధికారులకు చాలెంజ్ కు ఆహ్వానించారు. కర్ణాటకలో తన తెలివితేటలతో బీజేపీని చావుదెబ్బ తీసిన ప్రత్యర్థి కుమారస్వామికి మోడీ ఫిటెనెస్ చాలెంజ్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.ఇంతే కాదు కుమారస్వామి తిరిగి మోడీకి ట్విట్టర్ ద్వారా… తాను ప్రతి రోజు వ్యాయామం, యోగ చేస్తాననని , నా ఆరోగ్యం బాగానే వుంది. కానీ కర్ణాటక రాష్ట్ర పరిస్థితే బాగాలేదని కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

To Top
error: Content is protected !!