తెలంగాణ

అద్భుతం భావ-హరీష్ రావు ను ప్రశంసించిన కేటీఆర్!

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , హరీష్ రావు ల మధ్య విబేధాలున్నాయన్న జోరుగా ప్రచారం జరిగింది . ఇక ఎన్నికల సమయంలో ప్రచారంలోకి వెళ్తున్న సమయంలో కేటీఆర్ , హరీష్ రావును కలిసి బావ నీకు లక్ష మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు . దింతో కేటీఆర్ , హరీష్ ల మధ్య విభేదాలు లేవని చెప్పినట్టయింది .ఇది ఇలా ఉండగా టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమితుడు అయిన తరువాత మళ్ళి హరీష్ , కేటీఆర్ లకు పడటం లేదని వార్తలు మరింత ఊపందుకున్నాయి .

దింతో హరీష్ వెళ్ళి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిండెంట్ ఎంపికయినందుకు శుభాకాంక్షలు తెలియజేశాడు . ఇక తాజా గా సిద్ధిపేట మార్కెట్లో ప్రపంచస్థాయి సౌకర్యాలు, ఒకేచోట పక్కపక్కన కూరగాయలు, మాంసం దుకాణాలు అందుబాటులో ఉండేలా మార్కెట్‌ను నిర్మించినట్లు హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆ మార్కెట్ ని నిర్మించామని పేర్కొన్నారు . ఒకేచోట కూరగాయలు, మాంసాన్ని విక్రయించేందుకు భారీ మార్కెట్ ను అత్యాధునికంగా నిర్మించారు.దాదాపు రూ.20కోట్లు ఖర్చు చేసి దీనిని నిర్మించారు. కాగా ఆ మార్కెట్ కి సంబంధించిన ఫోటోలను హరీశ్… తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

ఈ ఫోటోలను ట్విట్టర్ లో చూసిన కేటీఆర్ దానికి స్పందించారు. చూడటానికి చాలా అద్భుతం గా ఉందని నీకు నా అభినందనలు బావా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో హరీశ్ తో కేటీఆర్ కి మధ్య సంబంధం ఎప్పటిలాగానే ఉందని చెప్పకనే చెబుతోంది. ఇక కేటీఆర్ తోపాటు.. నెటిజన్లు కూడా హరీశ్ ట్వీట్ పై స్పందిస్తున్నారు. సిద్ధిపేటలో ఇంతటి ఉన్నత ప్రమాణాలతో మార్కెట్‌ను తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుందని.. మంచి ఆలోచన అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

To Top
error: Content is protected !!