తెలంగాణ

ఆ బ్లాక్ బస్టర్ మూవీకి కేటీఆర్ రివ్యూ!

తెలంగాణ మాజీ మంత్రి – టీఆర్ ఎస్ పార్టీ ముఖ్య నేత కేటీఆర్ తనకు సన్నిహితులు ఆప్తులకు సంబంధించిన చిత్రాలను చూడటం – వాటిపై స్పందించడం జరుగుతుంది. తాజాగా కేటీఆర్ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ ను చూశారట. ‘బాహుబలి’ తర్వాత సౌత్ సినిమాల స్థాయిని మరోసారి బాలీవుడ్ లో నిరూపించిన చిత్రం ‘కేజీఎఫ్’.

కన్నడంలో మొదటి సారి వంద కోట్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కేజీఎఫ్’ చిత్రం తెలుగులో కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని సైతం ఆకర్షించిన ఈ చిత్రంపై కేటీఆర్ కూడా ప్రశంసల జల్లు కురిపించారు.తాజాగా కేజీఎఫ్ ను చూసిన కేటీఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ… కాస్త లేట్ అయినా ‘కేజీఎఫ్’ సినిమాను చూశాను. సినిమా చాలా బాగుంది. టెక్నికల్ గా చాలా బాగుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్బుతంగా సినిమాను తెరకెక్కించాడు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. రాక్ స్టార్ – హీరో యష్ నటన అదిరిపోయింది అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు చేసి సంచలనాలు సృష్టించింది.మొదటి పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం రెండవ పార్ట్ కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

కేజీఎఫ్ ఛాప్టర్ 2 కోసం బాలీవుడ్ స్టార్స్ ను సైతం రంగంలోకి దించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ కలెక్షన్స్ తో పాటు ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్న కేజీఎఫ్ రెండవ పార్ట్ అంతకు మించి ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.

To Top
error: Content is protected !!