సినిమా

బిగ్ బాస్ లో కలకలం అర్ధరాత్రి దీప్తితో కౌశల్ అసభ్యప్రవర్తన!

బిగ్ బాస్ లో కలకలం అర్ధరాత్రి దీప్తితో కౌశల్ అసభ్యప్రవర్తన!

సోమవారం ఉదయం నందినీ రాయ్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరైంది. నందినీ రాయ్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంటి సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అందరూ కలిసి వెళ్లి ఆమెను ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు…, నందినీ రాయ్ అందం చూసి ఇంటి సభ్యులు ఫిదా అయిపోయారు. ఇక బిగ్ బాస్ ఇంట్లోని మేల్ కంటెస్టెంట్స్ నందినీ రాయ్ అందం చూసి ఫిదా అయిపోయారు. కౌశల్ లాంటి ఫాస్ట్ కుర్రాళ్ళు అయితే ఆవిడకు హగ్గులతో వెల్కమ్ చేశారు ., ఆమె రాకతో వారిలో మరింత ఉత్సాహం నెలకొంది. ఇక ఆ రాత్రి దీప్తి సునయన చేసిన పని అందరినీ భయపెట్టింది. దీప్తి అర్ధరాత్రి వేళ పిల్లిలా వేశం వేసుకొని గాఢ నిద్రలో ఉన్న ఇంటిసభ్యుల వద్దకు వెళ్లి వారిని లేపింది. ఇలానే తనీష్, అమిత్ రాయ్ లను లేపగా వారు ఉలిక్కిపడ్డారు. తర్వాత దీప్తి అని తెలిసి గట్టిగా నవ్వారు. ఈ పరిణామాలు చూసిన తేజస్వి కూడా దీప్తి జాయిన్ అయ్యి బాబుగోగినేని సహా అందరినీ లేపింది. ఇక చివర్లో కౌశల్ ముసుగు తన్ని పడుకుంటే.. అతడి దుప్పటి తీసింది దీప్తి.కౌశల్ కూడా భయపడి దడుసుకున్నాడు. తనను భయపెడతావా అంటూ దీప్తిని అమాంతం చేతులతో లేపి హగ్ చేసుకొని ఆమె బెడ్ పై పడేశాడు. తోటి సభ్యులు సైతం కౌశల్ ఇలా దీప్తిని పట్టుకోవడంపై అవాక్కయ్యారు. ఎంతైనా అమ్మాయిని ఇలా కౌశల్ చేతులు వేసి తడమడంపై అందరూ విస్తుపోయారు .., ఈ విషయంపై దీప్తి కూడా చాలా బాధపడింది. ఎలిమినేషన్ ప్రక్రియలో యాంకర్ శ్యామలతో కలిసి దీప్తి పాల్గొంది. ఈ సందర్భంగా కౌశల్ వైఖరిపై బాధపడింది. కౌశల్ ఇంటిలోకి వచ్చినప్పటి నుంచి అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేస్తున్నాడని.. రాగానే సంజన జైల్లో పడితే ఆమె చేతులు పట్టుకొని తడిమాడని.. తర్వాత ఇంట్లోని ఆడవాళ్ల బుజాలపై చేయి వేసి అతి చేస్తున్నాడని.. కౌషల్ వైఖరిని ఆడవాళ్లందరూ తట్టుకోలేకపోతున్నారని దీప్తి బిగ్ బాస్ కు కంప్లైట్ చేసింది. దీనికి శ్యామల కూడా కౌశల్ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు సరిగా లేదని మార్చుకోవాలని సపోర్ట్ చేసింది. ఇలా సరదాకు అల్లరిపిల్ల దీప్తి చేసిన పని అందరినీ భయపెట్టగా.. కౌశల్ వల్ల దీప్తి ఇబ్బందిపడింది. కౌషల్ అమ్మాయి అని చూడకుండా మిస్ బిహేవ్ చేయడం 9వ రోజు ఆటలో దుమారం రేపింది.

To Top
error: Content is protected !!