క్రీడలు

ఫ్లేఆఫ్‌ రేసులో కోల్‌కతా: పంజాబ్‌పై ఘన విజయం

kkr wins against kxip in crucial match
ఫ్లేఆఫ్‌ రేసులో కోల్‌కతా: పంజాబ్‌పై ఘన విజయం

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ గెలిచింది. కానీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మనసులు గెలిచింది! అద్భుత పోరాట పటిమ కనబరిచింది. 246 పరుగుల కొండంత లక్ష్యాన్ని చూసి ఆ జట్టు వెన్ను చూపలేదు. అసాధారణంగా పోరాడింది. కీలక బ్యాట్స్‌మెన్‌ ఔటైతే భారీ తేడాతో ఓడిపోవడం ఖాయమన్న అపప్రదను తొలగించుకొనే ప్రయత్నం చేసింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. కోల్‌కతా గెలుపు పరుగుల అంతరాన్ని 31కి తగ్గించింది. ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (66; 29 బంతుల్లో 2×4, 7×6), రవిచంద్రన్‌ అశ్విన్‌ (45; 22 బంతుల్లో 4×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆరోన్‌ ఫించ్‌ (34; 20 బంతుల్లో 3×4) ఫర్వాలేదనిపించాడు. ఛేదనలో పంజాబ్‌ రన్‌రేట్‌ 10కి తగ్గకపోవడం విశేషం. కోల్‌కతాలో ఆండ్రూ రసెల్‌ 3, ప్రసిధ్‌ కృష్ణ 2, నరైన్‌, కుల్‌దీప్‌ తలో వికెట్‌ పడగొట్టారు.అంతకు ముందు కోల్‌కతాలో సునిల్‌ నరైన్‌ (75; 36 బంతుల్లో 9÷4, 4×6), దినేశ్‌ కార్తీక్‌ (50; 23 బంతుల్లో 5×4, 3×6) రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా చెలరేగడంతో 245 పరుగులు సాధించింది. ఈ ఐపీఎల్‌లో ఇదే అత్యధిక స్కోరు. ఐపీఎల్‌ చరిత్రలో నాలుగోది. ప్రస్తుత విజయంతో నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్‌ రేసులో కాస్త ముందంజ వేసింది.

To Top
error: Content is protected !!