ఆంధ్ర ప్రదేశ్

వైసిపిలోకి కేఈ కృష్ణమూర్తి …. ?

KE Krishnamurthy Upset Over Kotla's Entry Into TDP
వైసిపిలోకి కేఈ కృష్ణమూర్తి …. ?

అంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి . నిన్న కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చంద్రబాబు ను కలిశారు . దింతో ఆయన టిడిపి లో చేరడం దాదాపు ఖరారు అయింది .

కాగా కోట్లను టీడీపీలో చేర్చుకునే విషయంలో చంద్రబాబు స్వయంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఈ చర్చల ఫలితంగానే – టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని అంటున్నారు.కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం సీఎం చంద్రబాబుతో భేటీ అవటంపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అలక వహించారు .

కోట్ల పార్టీలో చేరటానికి చంద్రబాబు ముందు పెట్టిన డిమాండ్లలో డోన్ సీటు ఒకటి . దింతో కోట్ల పార్టీలో చేరితే డోన్ నుంచి ఎవరిని పోటీ చేయించాలన్న దానిపై పీఠముడి పడనుంది. డోన్ నుంచి కోట్ల సుజాతమ్మను – కానీ తన కుమారుడు రాఘవేంద్రను కానీ బరిలో దించాలని కోట్ల ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

అయితే చాలా కాలంగా కేఈ కుటుంబం డోన్ నుంచి పోటీ చేస్తోంది. జిల్లాలో కోట్ల – కేఈ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. కోట్ల పార్టీలో చేరిన తర్వాత జిల్లాలో ఎలాంటి ప్రభావం ఉంటుందోనని టీడీపీ శ్రేణులు వేచి చూస్తున్నాయి.కాగా కోట్ల వర్గం సీఎంతో భేటిపై ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసారు.

కోట్ల టీడీపీలో చేరికపై నాకు సమాచరం లేదని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. మరోవైపు ఢోన్ సీట్ల కోట్లకు ఇస్తుండటడంతో కేఈ మనస్థాపం చెందారని సమాచారం. దీంతో తన కుమారుడు కేఈ శ్యామ్ బాబు కోసం కేఈ వైసీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో కేఈ కృష్ణమూర్తి ఏ విదంగా స్పందిస్తాడో చూడాలి మరి.

To Top
error: Content is protected !!