ఆంధ్ర ప్రదేశ్

బాబుకి దిమ్మతిరిగే రీతిలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్

kcr bumper return gift to chandrababu
బాబుకి దిమ్మతిరిగే రీతిలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు , టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినందున ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ తలదూర్చబోతోందని .. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ గతంలో హెచ్చరించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజా కూటమి ఏర్పాటులో టీడీపీ కీలకంగా వ్యవహరించింది. కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ‌లను కూడగట్టడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది ..తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన టీడీపీకి ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు టీఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేసింది . తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి బాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ గతంలో చెప్పారు.. ఏపీ రాజకీయాల్లో తాను వేలు పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందో చంద్రబాబునాయుడు చూస్తారని కూడా కేసీఆర్ హెచ్చరించారు. చెప్పినట్టుగానే జగన్ కి అన్ని విధాలా సహకరించారు .. జగన్ కూడా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచే తన వ్యూహాలు అమలుపరిచారు . ప్రచారం చేస్తున్న సమయంలోను కేసీఆర్ సలహాలు తీసుకున్నారన్న టాక్ వినిపించింది .. ఇక బాబు తనపై ఎన్ని విమర్శలు చేసినా జగన్ కోసం మౌనంగా భరించారు .. తన నైజానికి వ్యతిరేఖంగా గమ్మునున్నారు .. చివరకి ప్రత్యేక హోదాకి మద్దతుఇస్తానని తెలిపి జగన్ కి సహాయం చేశారు .. మొత్తం మీద జగన్ కి అండగా ఉంది .. బాబుకి దిమ్మతిరిగే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కేసీఆర్ .

To Top
error: Content is protected !!