ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఓటర్లకి ఝలక్ ఇచ్చిన కావేరి ట్రావెల్స్

kaveri travels shock to AP passengers
ఏపీ ఓటర్లకి జలక్ ఇచ్చిన కావేరి ట్రావెల్స్

ఏపీ ఓటర్లకు కావేరి ట్రావెల్స్ షాకిచ్చింది. చివరి నిమిషంలో ఏకంగా 125 బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని ఏపీ ఓటర్లు సొంతూళ్లు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో నేడు ఊరు వెళ్లేందుకు టికెట్లు కూడా ముందుగానే బుక్ చేసుకున్నారు. వీరిలా చాలామంది ప్రైవేటు ట్రావెల్స్‌ను నమ్ముకున్నారు. కాగా, కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ఒక్కసారిగా 125 బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.

దీనికి తోడు తెలంగాణలో లైసెన్స్ లేదన్న కారణంతో తెలంగాణ ఆర్టీఏ అధికారులు మరికొన్ని ట్రావెల్స్ బస్సులను రద్దు చేశారు. దీంతో మొత్తంగా 200 వరకు బస్సులు నిలిచిపోయాయి.

బస్సులు రద్దయ్యాయంటూ ప్రైవేట్ యాజమాన్యాలు ప్రయాణికులకు మెసేజ్‌లు పంపడంతో ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ప్రయాణికులు. ఇక దీనికి తెలంగాణ ప్రభుత్వం మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఎదురు చూడక తప్పదు.

To Top
error: Content is protected !!