నేషనల్

రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి ముక్కూ,చెవులు కోసేస్తాం!

రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి ముక్కూ,చెవులు కోసేస్తాం!

రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి కిరణ్ మహేశ్వరిపై కర్ణి సేన మండిపడుతోంది. తమను ఎలుకలతో పోల్చిన మంత్రిపై నిప్పులు చెరుగుతున్నారు. కర్ణి సేన వర్గం ప్రజలకు తక్షణం క్షమాపణలు చెప్పకపోతే ఆమె ముక్కూ చెవులు కోసేస్తామని హెచ్చరించింది. గతంలో కర్ణిసేన దీపిక పదుకొని నటించిన ‘పద్మావత్’సినిమా విషయంలో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఒకదశలో ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత తాము చేసింది తప్పని చిత్ర యూనిట్ కి క్షమాపణలు చెప్పారు.
తాజాగా రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి కిరణ్ మహేశ్వరిపై శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన సభ్యులు నిప్పులు చెరుగుతున్నారు. కాగా, రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సర్వ్ రాజ్ పుత్ సమాజ్ సంఘర్ష్ సమితి ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంపై మంత్రి మహేశ్వరి విమర్శలు గుప్పించే క్రమంలో ఆమె ఓ వ్యాఖ్య చేశారు. ‘ఇక్కడ కొంతమంది ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రంధ్రాల్లో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్టుగా వస్తారు’ అని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలను కర్ణిసేన తప్పుబట్టింది. దీనిపై స్పందించిన కర్ణిసేన మంత్రి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

To Top
error: Content is protected !!