నేషనల్

బీజేపీకే కన్నడ పీఠం.. ముహూర్తం ఉ9.00

bjp to form government in karnataka
బీజేపీకే కన్నడ పీఠం.. ముహూర్తం ఉ9.00

సస్పెన్స్ వీడింది. కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా తన నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అధికారికంగా రాజ్‌భవన్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. యడ్యూరప్ప గురువారం ఉదయం 9.00 గంటలకు కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న యడ్యూరప్ప.. 10రోజుల్లోగా అంటే మే27లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ సూచించారు. ఆ తర్వాతే మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. గవర్నర్‌ నిర్ణయంతో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.

To Top
error: Content is protected !!