తెలంగాణ

కల్వకుంట్ల కవిత రియల్ స్టోరీ!

kalvakuntla kavitha real life story
కల్వకుంట్ల కవిత రియల్ స్టోరీ!

తెలంగాణ యాస , భాషా , కట్టు బొట్టు అన్ని కలగలిపితే కనిపించే పేరు ఆమె .. పులా పండగైన బతుకమ్మను పలుదేశాలకు సాటిచెప్పిన ఘనత ఆమె సొంతం . తెలంగాణ ఆడపడుచులకు ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం . తెలంగాణ రాష్ట్రము నుండి తొలి మహిళగా పార్లమెంట్ లో గళం విప్పిన నాయకురాలు . తన వక్తా చాతుర్యంతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే నేత . ఒక ఎంపీ అయినప్పటికీ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చూడటానికి సాధారణ వ్యక్తి లా కనిపించేది కల్వకుట్ల కవిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె … అలాంటి నాయకురాలు గురించి ఒకసారి తెలుసుకుందాం ..

బాల్యం . చదువు ..

కవిత 1978 మార్చి 13 న కరీంనగర్ జిల్లా చింతమడక గ్రామంలో జన్మించింది . కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , శోభ దంపతులకు రెండో సంతానంగా మహాలక్ష్మి పుట్టిందని అందరు ఆనందపడ్డారు . తండ్రి చంద్రశేఖర్ రావు పేరున్న నాయకుడైనప్పటికీ కవిత మాత్రం ఆ గుర్తింపు కు దూరంగా పెరిగింది .సిద్దిపేటలో మొదటి తరగతి ఆ తరువాత మూడవ తరగతి వరకు అమ్మమ్మ వాళ్ళ ఉరిలో చదివింది . ఇక మూడవ తరగతి తరువాత చదువు అంతే హైదరాబాద్ లోనే కొనసాగింది . స్టాండ్లీ గర్ల్స్ స్కూల్ 10వ తరగతి వరకు చదివిన కవిత ప్రతిభ గల విద్యార్ధినిగా పేరు తెచ్చుకుంది .ఇక ఇంటర్మీడియేట్ ఎంపిసిలో గౌతమి గర్ల్స్ పూర్తి చేసింది .

కాకతీయ అకాడమీ లో ఎంసెట్ కోచింగ్ తీసుకుని మంచి రాంక్ సాధించింది . దింతో హైదరాబాద్ లోని విజ్ఞానన జ్యోతి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది .ఆ తరువాత చదువుల కోసం అమెరికా వెళ్లి 2001 లో అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందింది .. ఇక చదువు పూర్తి అయిన తరువాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసింది …. ఇక 2003 లో కల్వకుంట్ల కవిత కు దేవన్‌పల్లి అనిల్ తో వివాహం జరిగింది .అనిల్ ఒక మెకానికల్ ఇంజనీరు. పెళ్లి తరువాత కూడా కవిత అమెరికా వెళ్ళింది . ఇక కవిత , అనిల్ దంపతులకు ఆదిత్య , ఆర్య ఇద్దరు కుమారులు ఉన్నారు .ఆమె సోదరుడు కల్వకుంట్ల తారకరామారావు .. ప్రస్తుతానికి ఆయన టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు ..

జీవిత విశేషాలు ..

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో 2004 లో కవిత అమెరికా నుండి తెలంగాణకు వచ్చింది . 2006 లో ఆమె నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి పేద పిల్లలకు ఉచిత విద్యనందించి స్థానిక ప్రజలకు ఎంతో సహకరించింది. 2009 లో కొన్ని తెలుగు చలన చిత్రాలలో తెలంగాణ భాష మరియు సంస్కృతిని అవహేళనకు గురి అవుతున్నాయని నంది అవార్డుల ప్రదానోత్సవంలో నిరసన తెలియజేశారు. 2010 లో అదుర్స్ సినిమా తెలంగాణలో విడుదల అయినపుడు వ్యతిరేకించి వార్తలలో ప్రముఖంగా నిలిచింది. అదుర్స్ సినిమాలోని నిర్మాణ వర్గం తెలంగాణ రాష్ట్ర యేర్పాటును వ్యతిరేకిస్తున్నందున ఆ సినిమా విడుదలను అడ్డుకొని వార్తలకెక్కింది. ఇక తెలంగాణ రాష్ట్ర యేర్పాటు ఉద్యమంలో క్రియాశీలక పాత్రను 2009 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ..

ఉద్యమ సమయం ..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2006 లో తనపదవికి రాజీనామా చేశాడు . తెలంగాణ రాష్ట్రం సాదించాదానికి తన తండ్రి తెలంగాణ ప్రజలు చేసే పోరాటాన్ని గమనించిన కవిత అప్పుడు జరిగిన ఉపఎన్నికల్లో తన తండ్రి కేసీఆర్ గెలిపించుకోవడానికి ప్రచారంలోకి దిగారు . ఆంధ్ర నాయకుల కుట్రలను ప్రజలకు తెలియజేసిన ఆమె తీరు, ప్రజలతో మెలిగే ఆమె సంప్రదాయం , ఒక సాధారణ వ్యక్తి లా ఉంటె ఆమె వ్యక్తుత్వం ప్రజలకు చేరువచేసింది . ఇక తరువాత ఉద్యమ సమయంలో ఒక మహిళగా తెలంగాణ ఆడపడుచులకు పోరాటంలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చింది . దింతో మహిళా నాయకురాలు కవిత ఉద్యమ పోరాటం చేసింది .

ఇక సీమాంథ్ర పాలనలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు , కళలు ,సాహిత్యం ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో 2008 జూన్ 6 తెలంగాణ జాగృతి స్థాపించింది .. ఇక శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల కోటను పరిరక్షించాలంటూ కవిత తొలిపోరాటం చేసింది . దింతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కోటిలింగాల కోటను అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించింది . ఇక తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేయడనికి 2008 అక్టోబర్ లో రాష్ట్రంలో ఉన్న 10 జిలాల్లో తొలిసారిగా కవిత బతుకమ్మ ఉత్సవాలు జరిపారు ..అలాగే ప్రభుత్వ ప్రోత్సాహం లేక బాధపడుతున్న నిరుద్యగులకు జాగృతి తరుపున మార్కెటింగ్ ,పలు ప్రైవేట్ కంపెనీల సహకారంతో యువతకు దారి చూపించారు కవిత.

ఒకవైపు జాగృతి తరుపున తెలంగాణ సంప్రదాయాలను కాపాడుతూనే మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశారు . ప్రి జోన్ కు వ్యతిరేకంగా సిద్దిపేటలో కవిత లక్షల మంది కి పైచిలుగా ప్రజలతో ధర్నా లో పాల్గొన్నారు .తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదం వినిపించినప్పుడు బిడ్డగా తండ్రికి ఏమవుతుందోనని ఆందోళన చెందిన కోట్లాది ప్రజల కోసం తండ్రి చేస్తున్న పోరాటానికి అండగా నిలిచారు .. జాగృతి అద్వ్యర్యంలో సకల జనుల సమ్మె , రైలు రోకో , వంటా వార్పు , అనేక ధర్నాలు చేయడంలో కవిత కీలక పాత్ర పోషించారు . ఇక బతుకమ్మ పండుగను 2010 ఆక్టోబర్ లో కోటిబతుకమ్మ పండగను హైదరాబాద్ లో లక్షల మందితో కలిసి కవిత నిర్వహించారు . ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము తీసుకురావడంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారం చేయడంలో కవిత చేసిన కృషి ఎనలేనిది అని చెప్పవచ్చు

రాజకీయ అరంగేట్రం ….

2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రము తీసుకురావడంలో టీఆరెస్ పార్టీ ఎంతో కృషిచేసిందని ప్రజలకు తెలియజెప్పి టీఆరెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకురావడంలో తన వంతు పాత్రా కవిత పోషించారు . ఈ నేపథ్యంలో నిజామాబాదు పార్లమెంట్ స్తానం నుండి పోటీ చేసి లక్ష డెబ్భైవేల మెజార్టీ తో విజయం సాధించారు .. దింతో మొదటిసారి మహిళా నాయకురాలు గా పార్లమెంట్ లో అడుగుపెట్టారు . .తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన కుటుంబాలకు 10లక్షలు చొప్పున ఆర్థికసాయం అందించింది వారి కంటతడి తీర్చారు . నిజామాబాదు లో పసుబోర్డు కోసం పార్లమెంట్ లో గళం విప్పారు .

అలాగే జగిత్యాల జిల్లాలోని అంతర్గామ , బోధన్ పరిధిలోని కందకుర్తి గ్రామాలను కవిత దత్తతగా తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు . ఇక ఎంపీగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత కేంద్రం ఫై ఒత్తిడి తీసుకువచ్చి నిజామాబాదు , పెద్దపల్లి రైల్వే లైన్ పూర్తి చేశారు .. గత కొన్ని సంవత్సరాలుగా మూతపడ్డ నిజామాబాదు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేపించారు .ఇలా నిజామాబాదు అభివృద్ధి కోసం కవిత తనవంతు కృషిచేశారు . రాష్ట్ర పండుగైన బతుకమ్మ పలు దేశాల్లో చాటి చెప్పారు . బతుకమ్మ పండగ వస్తే 10 రోజుల పాటు జిల్లాల్లో పర్యటలు చేస్తూ సంస్కృతి సంప్రదాయాలను తెలియచెప్పారు .

అంతేకాకుండా ఇతర దేశాల్లో కూడా బతుకమ్మ పండగను జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను సాటిచెప్తున్నారు .. ఈ క్రమమంలో కవిత అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే కవిత అనేలా పేరు తెచ్చుకున్నారు . ఇక 2018 లో జరిగిన ఎన్నికల్లో కవిత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేశారు .నిజామాబాద్ జిల్లా ప్రచారం బాధ్యతలు తీసుకుని ప్రచారం చేశారు .. అంతేకాకుండా జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ మాజీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ని ఓడించిన ఘనత కవితకే దక్కుతుంది .. జగిత్యాలలో టీఆరెస్ జెండా మొదటిసారి పాతడంలో కవిత పాత్ర ఎనలేనిది అని చెప్పవచ్చు . టీఆరెస్ ప్రభుతం ఏర్పాటు , ఎన్నికల్లో అభ్యర్థులు గెలవాడినికి కవిత తనవంతు పాత్ర పోషించారు .. ఇటీవల తన పాలనను మెచ్చిన కేంద్రం ప్రభుత్వం ఉత్తమ ఎంపీగా కవిత ఎన్నికచేసింది ..

ఎండ్ …

ఇలా మహిళా నాయకురాలు గా తెలంగాణ ఆడపడుచులకు కవిత ఆదర్శం గా నిలుస్తున్నారు . తెలంగాణ కట్టుబాట్లకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు . తాను చదివిన ఉన్నత చదువు , ఆమె వక్తా చాతుర్యం కవితకు కలిసొచ్చే అంశాలు . ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు అయినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు . ఇక మొత్తానికి కవిత తండ్రికి తగ్గ కూతురు గా కవిత పాలనా కొనసాగిస్తున్నారు . రాష్ట్ర ప్రజల కోసం పాటుపడున్న కవిత రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు పొందుతూ ముందుకుసాగాలని కోరుకుందాం …

To Top
error: Content is protected !!