సినిమా

జెర్సీ మూవీ రివ్యూ మరియు రేటింగ్

jersey movie review and rating
జెర్సీ మూవీ రివ్యూ మరియు రేటింగ్

నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన చిత్రం జెర్సీ. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. క్రికెట్ నేపథ్యానికి ఒక అద్భుతమైన స్టోరీ జోడించి ఎమోషనల్ జర్నీగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఎలా ఉంది.. ఆడియన్స్ నుంచి ఎలాంటి టాక్ అందుకుంది .. విడుదులకు ముందు ఏర్పరచుకున్న అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం

కథ . కధనం , విశ్లేషణ

ముందుగా కథ విషయానికి వస్తే ..నాని కెరీర్లోనే విభిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రంగా జెర్సీని చెప్పుకోవచ్చు . నాని.. అర్జున్ అనే రంజీ క్రికెటర్ పాత్రలోఇందులో కనిపిస్తారు. 26 ఏళ్ల వయసులోనే కొన్ని కారణాల వలన ఆటకు దూరమైన అర్జున్.. రిటైర్ అయ్యే వయసులో మళ్లీ బ్యాట్ పడతాడు ..అందుకు గల కారణమేంటి.. క్రికెట్ ప్రపంచంగా బ్రతికే అర్జున్ దానికి ఎందుకి దూరం అయ్యాడు అనేది ఎమోషనల్ గా సాగే జర్నీ కథ . ఇక ఇందులో భార్య -భర్తల మధ్య గొడవలకు కారణమేంటి ..అర్జున్ కొడుకు ఎలాంటి పాత్ర పోషించాడు ..

అర్జున్ క్రికెట్ జర్నీ , జీవితంలో అతను సాగించిన జర్నీ .. జెర్సీ గ ఎలా మారింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ..ఇక నటీనటుల విషయానికి వస్తే .. ఇందులో నాని అద్భుతమైన నటనను కనబరిచారు .. ఒకరకంగా చెప్పాలంటే కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు .క్రికెటర్ గా అవ్వాలని అతను చేసే ప్రయత్నాల్లో నాని నటన సూపర్ ..అలాగే క్రికెట్ కి దూరమయ్యే సందర్భంలోను నాని నటనను మెచ్చుకోకుండా ఉండలేము ..ఇక రిటైర్ అయ్యే వయసులో మళ్ళి బ్యాట్ పట్టుకోవాల్సిన సందర్భంలోను నాని తనలోని ఉత్తమ నటనను కనబరిచాడు ..

ఇక హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ కి కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది . కెరీర్ లో ఎదగలేకపోయిన భర్త ని ఓదార్చే తరహా పాత్రలో , అతనికి బాధ్యత గుర్తుచేసే సందర్భాల్లో శ్రద్ద చక్కని నటన కనబరిచింది .అలాగే పెళ్ళికి ముందు సన్నివేశాల్లో గ్లామర్ కూడా కురిపించింది . .క్రికెట్ కోచ్ గా సత్యరాజ్ ,జట్టు ఎంపిక సభ్యునిగా సంపత్ తమకు అలవాటైన రీతిలో మెప్పించారు .మిగతా నటీనటులు పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ..ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ..గౌతమ్ స్టోరీ, డైరెక్షన్ సూపర్ అని చెప్పవచ్చు .. అక్కడక్కడా కొన్ని సీన్లు నెమ్మదించినట్టు అనిపించినా .. తాను అనుకున్న కథను తెరపై చూపడంలో దర్శకుడు విజయం సాధించారని చెప్పుకోవచ్చు ..ఇక అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా మారింది .

ఇక సాను ఫొటోగ్రఫీ బాగుంది ..చాల సన్నివేశాలను తన కెమెరా పని తనంతో గొప్పగా చూపించారు ..అలాగే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కూడా తన బాధ్యతను చక్కగా నెరవేర్చాడు .. ఇక ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు కొంత పని చెప్పాల్సి ఉన్నా .. ఇలాంటి ఎమోషనల్ సినిమాకు అయన చాలావరకు న్యాయం చేశారనే చెప్పుకోవాలి ..అలాగే చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి .సినిమాను ఒకసారి శ్లేషించినట్లయితే ..రోడ్డు ప్రయాణంలో జాగ్రత్త తీసుకోమని చెప్పే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవడమే ఆడియెన్స్ ని మెప్పించేలా ఉంది .అర్జున్ కుమారుడు తన తండ్రి జీవితంపై ‘జెర్సీ’ అనే పుస్తకం రాసే నేపథ్యంలో కథ మొదలవడం ఆసక్తి రేకెత్తించేలా ఉంది .

1986 నాటి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిడం … క్రికెట్ స్టేడియం‌లో నాని, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలను పరిచయం చేయగానే కథ మరో పదేళ్లు ముందుకు అంటే.. 1996 వెళ్లడం వంటివి అర్ధమయ్యే రీతిలో చక్కగా చూపించారు . మంచి క్రికెటరైన అర్జున్…. కొన్ని కారణాలతో ఆటను వదిలిపెట్టడం .. పదేళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడటం సహజంగా చూపించడంతో ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేసింది. అర్జున్, అతడి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు. అలాగే నాని -శ్రద్ద మధ్య వచ్చే సన్నివేశాలు సూపర్ అనిపించేలా సాగాయి .

మళ్లీ క్రికెట్లో అడుగు పెట్టాలని భావించిన అర్జున్ తాను అనుకున్నది సాధించే సన్నివేశాలు .. హైదరాబాద్, ముంబై రంజీ ఫైనల్ మ్యాచ్ చిత్రీకరించిన విధానం భావోద్వేగాలకు గురి చేస్తుంది. స్పోర్ట్స్ డ్రామాలో ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేసిన విధానం ఆకట్టుకుంది. అయితే కొన్ని చోట్ల ఫ్యామిలీ డ్రామా సీన్లు కాస్త సాగినట్లు ఉన్నా పెద్దగా బోర్ మాత్రం అనిపించదు.మొత్తంగా ఒక క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం.. నానికి మరో విజయాన్ని అందిస్తుందని చెప్పవచ్చు .

To Top
error: Content is protected !!