ఆంధ్ర ప్రదేశ్

‘జగన్’… ఫ్లెక్సీలో…బాలయ్య బొమ్మ అదిరింది!

'జగన్'... ఫ్లెక్సీలో...బాలయ్య బొమ్మ అదిరింది!

ఒక ఫ్లెక్సీ మీద ఇప్పుడు అందరి చూపు పడుతోంది. ఓవైపు జగన్.. మరోవైపు బాలకృష్ణ.. మధ్యలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ కాంబినేషన్లో ఒక ఫ్లెక్సీ ఆలోచనే చిత్రమనుకుంటే.. అది కాస్తా జగన్ పాదయాత్ర సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయటం ఆసక్తికర చర్చకు తెర తీసింది.ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమాని ఒకరు ఏర్పాటు చేసిన జగన్.. బాలయ్య ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. అందరూ మాట్లాడుకునేలా చేసింది. పాదయాత్రకు వచ్చిన వారంతా ఆ ఫ్లెక్సీ ను ప్రత్యేకంగా చూడటం గమనార్హం. ఇంతకీ ఈ ఫ్లెక్సీ ఎందుకు ఏర్పాటు చేశారన్న ఆరాలోకి వెళితే.. ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వ్యక్తి రాజకీయంగా జగన్ ను విపరీతంగా అభిమానిస్తాడట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన ఆ వ్యక్తి సినిమాల పరంగా బాలకృష్ణ వీరాభిమాని అట. దీంతో.. తాను నచ్చిన నాయకులతో పాటు.. తన అభిమాన నటుడ్ని ఫ్లెక్సీకి ఎక్కించటంతో ఇదో రేర్ కాంబినేషన్ లా మారి ఇప్పుడు అందరి దృష్టి ఆ ఫ్లెక్సీ మీద పడేలా చేసింది.

To Top
error: Content is protected !!