ఆంధ్ర ప్రదేశ్

మెదక్ నుండి బరిలోకి ప్రియాంక గాంధీ ….?

Is it true that Priyanka Gandhi is going to contest from Medak
మెదక్ నుండి బరిలోకి ప్రియాంక గాంధీ ….?

దేశంలో లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ రసవత్తరంగా మారుతున్నాయి . మరో సారి అధికార పీఠం అధిరోహించాలని బిజెపి ప్రభుత్వం ఉవ్విళూరుతుంది . ఈ నేపథ్యంలోనే ఈబీసీ లకు రిజర్వేషన్స్ , రైతులకు పెట్టుబడి సాయంగా 6 వేల రూపాయలు ఇస్తామని ఓటాన్ బడ్జెట్లో ప్రవేశపెట్టారు . తన ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు మోడీ . అమితాషా లు ప్రయత్నాలు చేస్తున్నారు .

ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమి నేతలు కూడ మోదీ చేసిన తప్పులను ప్రజలకు తెలియజేస్తూ ముందుకుపోతున్నారు . వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి చరమగీతం పాడాలని యోచిస్తున్నారు . ఈ నేపథ్యంలో సోనియా గాంధీ తన కూతురు ప్రియాంక గాంధీ ని రంగంలోకి దించింది . రాజకీయాలకు దూరంగా ఉంటున్న ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది . అంతేకాకుండా ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే క్రియాశీల పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇంచార్జ్ ను చేసింది .

దింతో కాంగ్రెస్ లో రాహుల్ , ప్రియాంక గాంధీలు వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ బిజెపిని గద్దె దించడమే లక్ష్యం గా పనిచేయాల్సి ఉంటుంది . ఐతే రాహుల్ గాంధీ గతంలో ఉత్తరప్రదేశ్ అమేథీ లోకసభ స్తానం నుండి పోటీ చేసి విజయం సాధించాడు . దింతో వచ్చే ఎన్నికల్లో కూడా రాహుల్ అమేథీ పార్లమెంట్ స్తానం నుండే పోటీ చేసే అవకాశం ఉంది . అయితే ప్రియాంక గాంధీ ఎక్కడ నుండి పోటీ చేస్తారు అనేది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది .

గతంలో సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ లోని రేబలి స్తానం నుండి పోటీ చేసి గెలిచారు .అయితే వచ్చే ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయదంటూ ప్రచారం జరుగుతుంది . దింతో ఇక్కడ ఆమె కూతురు ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి . కాని కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సోనియా మళ్ళి పోటీ చేస్తారని తెలుస్తుంది . దింతో ప్రియాంక గాంధీ తెలంగాణ లో మెదక్ లోకసభ నుంచి పోటీ చేస్తారని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు . 1980 లో పోటీ చేసి విజయం సాధించారు .

ఈ క్రమంలో ఇందిరాగాంధీ వారసత్వాన్ని ప్రియాంకా అందుకుంటారని చెప్తున్నారు . ప్రియాంక మెదక్ నుండి పోటీ చేయడం ద్వారా తెలంగాణలో కూడా కాంగ్రెస్ మరింత బలపడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఘోర పరాభవం పొందారు . ఇక లోకసభ ఎన్నికల్లో అయినా తమ సత్తా చూపాలని భావిస్తున్నారు . ఇక మెదక్ నుండి ప్రియాంక పోటీ చేయడం వారికీ కలిసొస్తుందని టీకాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు .

అంతేకాకుండా కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డ్ , జానా రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారు . గతంలో మెదక్ నుండి ఇందిరాగాంధీ గెలిచిన నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో మెదక్ నుండి ప్రియాంక పోటీ చేస్తే గెలవడం ఖాయం కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు … కాగా టి కాంగ్రెస్ నేతలు అభిప్రాయం మేరకు ప్రియాంక గాంధీ వచ్చే లోకసభ ఎన్నికల్లో మెదక్ నుండి పోటీ చేసి నానమ్మ ఇందిరా గాంధీ వాసత్వాన్ని అందుకుంటుందో చూడాలి మరి …

To Top
error: Content is protected !!