సినిమా

‘గల్లీబాయ్’ తెలుగు రీమేక్ కి సాయి ధరమ్ తేజ్?

is gully boy telugu remake with sai dharam tej?
'గల్లీబాయ్' తెలుగు రీమేక్ కి సాయి ధరమ్ తేజ్?

ఇటీవల హిందీలో సందడి చేసిన సినిమాల్లో ‘గల్లీబాయ్’ ఒకటి. రణ్ వీర్ సింగ్ ,అలియా భట్ జంటగా జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమాను విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన సన్నిహితులు ఖండించారు. అప్పటి నుంచి ఈ రీమేక్ లో సాయిధరమ్ తేజ్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

సక్సెస్ కోసం చాలా కాలంగా చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న తేజు, ఆల్రెడీ హిట్ కొట్టిన ‘గల్లీబాయ్’ చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై తేజు స్పందిస్తూ .. “అసలు ఇంతవరకూ నేను ‘గల్లీబాయ్’ సినిమానే చూడలేదు. అలాంటిది ఈ సినిమా రీమేక్ లో ఎలా చేస్తాను? .. ఇదంతా కేవలం పుకారు మాత్రమే” అని చెప్పుకొచ్చాడు. దాంతో తేజు కూడా ఈ సినిమా రీమేక్ లో చేయడం లేదనే విషయంలో స్పష్టత వచ్చి అయన అభిమానులు కొంత నిరాశ పడ్డారు.

ఏదేమైనా ఒకవేళ ఆ సినిమా రీమేక్ చేయాల్సి వస్తే సాయి తేజ్ చాలా బరువు తగ్గాల్సి ఉంటుంది మరియు ఫెయిల్యూర్ సినిమాల హిస్టరీ ఎక్కువ వుంది కాబట్టి సన్నగా ఈ సినిమా ద్వారా కనిపిస్తే కచ్చితం గా సినిమా హిట్ అవ్వొచ్చు అని బయట టాక్ ఒకేవేళ హిట్ అవ్వకపోయిన సన్నగా ఉన్నందున సినిమా ఆఫర్లు కచ్చితం గా వస్తాయి అని అయన అభిమానులు ఆశిస్తున్నారు. ఏదేమైనా చిత్రలహరి సినిమా తో సాయి తేజ్ పరవాలేదు అనిపించుకున్నాడు.

To Top
error: Content is protected !!