క్రీడలు

ఫైనల్లో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే…….

ipl final 2018 toss will play key role in winning the match
ఫైనల్లో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే.......

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ తుది దశకు చేరుకుంది. ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్స్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచుల్లో, ప్లేఆఫ్స్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లోనూ చెన్నై జట్టే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన జట్టు ఎక్కువ శాతం గెలిచింది. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కి అనుకూలించడంతో ఇక్కడ టాస్ గెలిచిన ఏ జట్టైన తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గు చూపుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఎంతటి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించిన అప్పటికి పిచ్ ఫ్లాట్ కావడంతో రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకి పరుగులు చేయడం కాస్త సులువు అవుతుంది. అంతేకాక సన్‌రైజర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన మూడు మ్యాచుల్లో రెండు మ్యాచులు చేజింగ్‌లో గెలిచినవే. దీంతో ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిస్తే.. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకొనే అవకాశం ఉంది.

మరోవైపు సన్‌రైజర్స్‌కి డిఫెండింగ్‌లో మంచి రికార్డు కూడా ఉంది. ఇదే వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 118 పరుగులు చేసిన హైదరాబా్ జట్టు ముంబైని కేవలం 87 పరుగులకే కట్టడి చేసి విజేతగా నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ చివరి మూడు ఓవర్లు మినహాయించి సన్‌రైజర్స్ చెన్నైని హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. మరోవైపు హైదరాబాద్ టాస్ గెలిచినా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తొలుత ఫీల్డింగ్ ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయి. తమ బౌలింగ్ లైన్‌ ఆప్‌తో చెన్నైని స్వల్పస్కోర్‌కే కట్టడి చేస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లు రాణిస్తే.. జట్టు విజయం సునాయం కానుంది. దీంతో ఈ మ్యాచ్‌లో టాస్ ఎంతో కీలకం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు.

To Top
error: Content is protected !!