నేషనల్

ప్రభుత్వ ఉద్యోగి నుండి… సీఎం వరకు యడ్యూరప్ప గురించి ఆసక్తికర విషయాలు

unknown things about yedyurappa
ప్రభుత్వ ఉద్యోగి నుండి... సీఎం వరకు యడ్యూరప్ప గురించి ఆసక్తికర విషయాలు

యడ్యూరప్ప పూర్తి పేరు బూకనకెరె సిద్దలింగప్ప యడ్యూరప్ప. కర్ణాటకలోని మాండ్యా జిల్లా కేఆర్ పేట్ తాలూకాలోని బూకనకెరె గ్రామంలో సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943 ఫిబ్రవరి 27న యడ్యూరప్ప జన్మించారు. తుమకూరు జిల్లా యెడియూర్ గ్రామ సిద్ధలింగేశ్వరుడు వారి ఇలవేల్పు. అందుకే యడ్యూరప్పకు ఆ పేరు పెట్టారు. యడ్యూరప్ప తన నాలుగేళ్ల ప్రాయంలోనే తల్లిని కోల్పోయారు. ప్రీ యూనివర్సిటీ(ఇంటర్మీడియట్) వరకు మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో చదివారు. 1965లోనే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో డివిజన్ క్లర్క్‌గా జాయిన్ అయ్యారు. అయితే కొద్దిరోజులకే ఆ జాబ్ వదిలేసి శికరిపుర వెళ్లిపోయారు. అక్కడ వీరభద్రశాస్త్రి రైస్ మిల్లులో క్లర్క్‌గా జాయిన్ అయ్యారు. 1967లో ఆ రైస్ మిల్ యజమాని కుమార్తె మైత్రాదేవిని యడ్యూరప్ప వివాహమాడారు. అనంతరం శివమొగ్గలో ఓ హార్డ్‌వేర్ షాపును ప్రారంభించారు. 2004లో యడ్యూరప్ప భార్య నీటిసంపులో పడి మరణించారు.

కాలేజీ రోజుల నుంచే ఆర్ఎస్ఎస్‌కు ఆకర్షితుడైన యడ్యూరప్ప హిందూత్వాన్ని బాగా ఫాలో అయ్యేవారు. ఈ నేపథ్యంలోనే యెడియూరప్ప(Yediyurappa)గా ఉన్న తన పేరును జ్యోతిషశాస్త్రం ప్రకారం 2007లో యడ్యూరప్ప(Yeddyurappa)గా మార్చుకున్నారు. యడ్యూరప్పకు రాఘవేంద్ర, విజయేంద్ర అనే ఇద్దరు కుమారులు, అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. యడ్డీ కుమారుల్లో ఒకరైన రాఘవేంద్ర ప్రస్తుతం శికరిపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
యడ్యూరప్ప ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు(2007, 2008, 2018) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణభారత దేశంలో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రి యడ్యూరప్పే కావడం విశేషం. 2008 తర్వాత బీజేపీ అధిష్టానం యడ్యూరప్పకు తగిన గౌరవం ఇవ్వకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా కర్ణాటక జనతా పక్ష అనే పార్టీని స్థాపించారు. అయితే 2014లో ఆ పార్టీని బీజేపీలో కలిపేసి మళ్లీ సొంతగూటికి వచ్చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీకి అత్యధిక స్థానాలు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు

To Top
error: Content is protected !!