నేషనల్

అభినందన్ మానసిక వేదన-అతని మాటల్లోనే!

Indian Pilot Abhinandan Varthaman Return Live News Update
అభినందన్ మానసిక వేదన-అతని మాటల్లోనే!

భారత భూభాగంలో దాడి చేయడానికి వచ్చిన పాకిస్థాన్ ఫైటర్ జెట్లను మిగ్ 21లో తరిమికొట్టేందుకు వెళ్లాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. అయితే, యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూలిపోయింది. అక్కడ అభినందన్‌ను పట్టుకుని కొందరు దాడి చేశారు. దీంతో అతడి ముఖంపై గాయమైంది. తర్వాత అభినందన్ వర్థమాన్‌ను పాక్ ఆర్మీ అధికారులు ప్రశ్నించారు. ఎదురుగా చావుకి మించి భయమకరమైన శత్రువులు ఉన్న ..తొణకని ఆత్మవిశ్వాసం , మొక్కవోని ధైర్యంతో పాక్ అధికారులకు సమాధానాలు ఇచ్చారు .

ఎంతగా హింసించినా ..తనపేరు , హోదా , నెంబర్ , తన మతం తప్ప అంతకు మించి ఏమి చెప్పలేదు ..అయితే అయన గురించి మీడియా ,ముఖ్యంగా సోషల్ మీడియా మాత్రం రకరకాల వార్తలు కుమ్మరించి ..అయన దెబ్బలతో కూడిన వీడియోలను పదే పదే చూపిస్తూ ..కుటుంబానికి తీరని మానసిక క్షోభకు గురిచేశారు ..ఈ నేపథ్యంలో అభినందన్ మానసిక వేదన ఎలా ఉంటుందో మీకు పరిచయం చేస్తున్నాను ..

నా పేరు అభినందన్ వర్ధమాన్.. యుద్ధ విమాన పైలెట్ ని .. మన దేశంపైకి దండెత్తి వచ్చిన శత్రు విమానాలను తరిమి కొట్టే ప్రయత్నంలో దాయాది దేశమైన పాకిస్థాన్ చెరలో పట్టుబడ్డాను .అక్కడ నన్ను ఎన్ని చిత్ర హింసలు పెట్టిన ..మౌనంగా భరించానే కానీ .. దేశం గురించి అడిగిన ఏ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేదు ..సైనికుడిగా చేరినప్పుడే నేను కొన్ని బాధ్యతలకు కట్టుబడ్డాను ..పాక్ ఆర్మీ చెరలో ఉన్నప్పుడు కూడా నేను అదే చేశాను ..నేను ఎదో గొప్ప పని చేశానని భావించడం లేదు ..నా కర్తవ్యాన్ని మాత్రమే నేను నిర్వర్తించాను .

మీరు ప్రయాణిస్తున్న యుద్ధ విమానం పేరేమిటి.. మీ మిషన్ పేరు ఏమిటి.. లాంటి ప్రశ్నలకు.. నేను ఏ వివరాల్ని చెప్పలేనంటూ సూటిగా చెప్పేసా కానీ .. ఏ ఒక్క విషయం నేను బయటపెట్టలేదు .. అది నా కర్తవ్య నిర్వహణలో భాగమే ..కానీ మీరు ఏమి చేశారు .. నన్ను కొట్టిన వీడియోలను .. పాక్ చెరలో నేను ఉన్న వీడియోలను పదే పదే చూపించి ..నా కుటుంబ సభ్యులకు మానసిక వేదన మిగిల్చారు .. నేను పాక్ సైన్యానికి ఏమి చెప్పకపోయినా ..మీరే నా గురించి అన్ని చెప్పి ..మీ రేటింగ్స్ కోసం ..మా కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చారు ..

మూడు తరాలుగా మా కుటుంబం దేశ సేవలో తరిస్తూనే ఉంది .మా తాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు ..ఇక మా నాన్న ఆర్మీలో సేవలందించి రిటైర్ అయ్యారు .. మూడు తరాలుగా దేశసేవలోనే తరిస్తున్నా..ఎప్పుడు బయటకు చెప్పుకోలేదు ..ఇప్పటికి నేనేమి చెప్పడం లేదు ..ఈ విషయాలు కూడా మీరే బయటపెట్టారు .. కర్తవ్య నిర్వహణలో భాగమవడం తప్ప ..మరో పని నాకు చేతకాదు ..అయితే నేను శత్రువుల చెరలో చిక్కినప్పటి నుంచి దేశం మొత్తం నేను క్షేమంగా రావాలని కోరుకుంది ..

ఎందరో పూజలు కూడా చేశారు ..వారికీ నేను హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ..అయితే అత్యుత్సాహం చూపించి ..అమానవీయంగా నన్ను పదే పదే చూపించినవారిని చూస్తుంటేనే నాకు బాధ కలుగుతుంది .. అయితే ఇది కోపంతో వస్తున్న బాధ కాదు ..ఆవేదనతో వస్తున్న బాధ .. ఇక నేను చేసిన కర్తవ్యాన్ని కొందరు త్యాగంగా అభివర్ణిస్తున్నారు ..గొప్ప సహజంగా చెబుతున్నారు ..కానీ నేను నా బాధ్యతను మాత్రమే నెరవేర్చాను.. కానీ జయహో వీరుడా.. జయహో అంటూ నన్ను కీర్తించడం నాకు నచ్చడం లేదు .

అయితే శత్రుగడ్డపై నీ ఉనికి మాకు కర్తవ్యం నూరిపోస్తోంది… నిన్ను రక్షించుకోలేకపోతే మా జీవితాలు వృథాగా తోస్తున్నాయి… మరుజన్మ అంటూ ఉంటే నీలాంటి జవానుగా భరతమాత ముద్దు బిడ్డగా జన్మించాలనుంది.. శత్రుమూకలను చీల్చిచెండా డాలనుంది.. మేరా భారత్ మహాన్.. వందేమాతరం.. జైహింద్.. అన్న స్ఫూర్తి మీలో కలిగిందని తెలిసి ఆనందపడుతున్నాను .. ప్రభుత్వాలు మాకెమిచ్చాయని నిత్యం ప్రశ్నించే మా బతుకుల పరమార్థాన్ని నీ మనోనిబ్బరం మమ్మల్ని ‌దోషిగా నిలబెడుతోంది..

ఏ కాంట్రాక్ట్ లో ఎంత దొబ్బొచ్చో అని నిత్యం ఆలోచించే మా రాజకీయ జీవితాలు నీ అనితర త్యాగం ముందు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి అన్న మాటలను మాత్రం నేను అంగీకరించడం లేదు .. .. కేవలం 500 రూపాయలకు అమ్ముడుపోయే మా కోసం నీవు ప్రాణాలే త్యాగంగా పెట్టావు…క్వార్టర్ మందుకే మేము పార్టీలు మారతాం.. నీకెందుకు సార్ ఇంత దేశ భక్తి.. శత్రువుల చేతికి చిక్కినా మొక్కవోని నిబ్బరంతో నీవు చెబుతున్న జవాబులు మా స్వార్థపూరిత జీవితాల్ని ప్రశ్నిస్తున్నాయి అని చెప్పడం పట్ల నేను చింతిస్తున్నాను .

మీరు నా సోదరులు ..మీ రక్షణే నా కర్తవ్యం .. సైన్యం లో ఉన్నప్పుడు ..శత్రువులు చెరలో ఉన్నప్పుడు కూడా నేను అదే బాధ్యత నిర్వర్తించాను .. దీనిని గొప్పగా చూపకండి ..చివరగా మీకు మరో మాట చెప్పదలచుకున్నాను .. సైనికుల త్యాగాలను పరిచయం చేయండి తప్పు లేదు ..కానీ వాటి నుంచి కూడా మీరు రేటింగ్స్ పొందాలని చూడకండి .. నా కోసం ప్రార్ధనలు చేసిన వారికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను .. నేను మళ్ళి నా కర్తవ్య నిర్వహణలో పునరంకితమవడానికి సిద్ధమవుతున్నాను ..జై హింద్ ..

To Top
error: Content is protected !!