నేషనల్

భారత్ లో అడుగుపెట్టగానే అభినందన్ చెప్పిన తొలి మాట!

India says Welcome Back Abhinandan as IAF hero comes home from pakistan
భారత్ లో అడుగుపెట్టగానే అభినందన్ చెప్పిన తొలి మాట!

వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ శుక్రవారం రాత్రి భారత గడ్డపై అడుగుపెట్టాడు. పాకిస్థాన్ కస్టడీ నుంచి విడుదలైన అభినందన్‌ను అధికారులు వాఘా సరిహద్దు వద్ద భారత భద్రతబలగాలకు అప్పగించింది. ఇక సరిగ్గా రాత్రి 9.25 నిమిషాలకు భారత గడ్డపై అడుగుపెట్టాడు. ఆయనకు ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్, బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అభినందన్ మాతృభూమిపై అడుగుపెట్టిన క్షణాన సంబరాలు మిన్నంటాయి.

ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై, అభిందన్ జయహో, జై హింద్ నినాదాలతో వాఘా సరిహద్దు మారు మోగింది.వాఘా బోర్డర్ కు వచ్చిన అభినందన్ బ్లేజర్, గ్రే పాంట్స్ ధరించి ఎంతో హుందాగా కనిపించాడు. అనంతరం తమ పైలట్ ను సాదరంగా తోడ్కొని వచ్చారు భారత వాయుసేన అధికారులు. ఈ సందర్భంగ అభినందన్ తన స్పందన తెలియజేస్తూ… ఇటీజ్ గుడ్ టు బీ బ్యాక్ అని తిరిగి సొంతగడ్డపై అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు అభినందన్.

అమృత్ సర్ నగర డిప్యూటీ కమిషనర్ శివ్ దులార్ సింగ్ థిల్లాన్ తో మాట్లాడుతూ అభినందన్ ఈ విధంగా మాట్లాడినట్లు సమాచారం. అయితే అభినందన్ అక్కడున్న మీడియాతో మాత్రం మాట్లాడకుండా అధికారులతో కలిసి వెళ్లిపోయాడు. అంతక ముందు అభినందన్ రాక సందర్భంగా..ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు ఆయనకు స్వాగతం చెబుతూ ట్వీట్లు చేశారు.

వింగ్ కమాండర్ అభినందన్ మీకు స్వాగతం ఆదర్శనీయమైన మీ ధైర్యాన్ని చూసి దేశం గర్విస్తోంది. 130 కోట్ల మంది భారతీయులకు మన సాయుధ బలగాలు స్ఫూర్తిదాయకం.వందేమాతరం అంటూ మోదీ ట్వీట్ చేశారు.‘వింగ్ కమాండర్ అభినందన్ మీ హుందాతనం, ధైర్యం మమ్మల్ని అందరినీ గర్వించేలా చేసింది.

స్వదేశంలోకి మీకు ప్రేమపూర్వక స్వాగతం’ అంటూ రాహుల్ తన ట్వీట్‌లో అభినందనలు తెలిపారు.‘అభినందన్ సురక్షితంగా భారత్ చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అతని ధైర్యం స్ఫూర్తినిచ్చే దేశభక్తికి ఆంధ్రప్రదేశ్ వందనం చేస్తోంది’ అని చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఇక ఇండియా చేరుకున్న అభినందన్ కి వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు పేర్కొన్నారు .

To Top
error: Content is protected !!