సినిమా

తన జీవితం గురించి నిజాలు భయపెట్టిన ఇలియాన!

Ileana D'Cruz reveals she has body dysmorphic disorder
తన జీవితం గురించి నిజాలు భయపెట్టిన ఇలియాన!

టాలీవుడ్‌లో గ్లామర్ పరంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది గోవా బ్యూటీ ఇలియానా. గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీ అయిన ఈ భామ ఇటీవలే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులముందుకొచ్చి అలరించింది.

రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాలో గ్లామర్ బాగా ఒలకబోసిందీ అమ్మడు. అలాగే సన్నగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కొంచెం లావు అయి తన అభిమానులను ఆకట్టుకుంది . కాగా తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన ఇల్లీ బేబీ.. తన వ్యక్తిగత విషయాలు చెప్పి షాకిచ్చింది.

‘‘దాదాపు పదిహేనేళ్ళు బాడీ డిస్మోర్ఫిక్‌ డిజార్డర్‌తో బాధపడ్డా. ఆ టైమ్‌లో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నా. ఈ వ్యాధి కారణంగా ఇక సినిమాల్లో నటించలేనేమో అనిపించేది. నాకు వచ్చిన వ్యాధి లక్షణం అలాంటిది.

అయితే అప్పుడు నా సన్నిహితులు, కుటుంబ సభ్యులు నాకు అండగా ఉన్నారు. మూడేళ్ల క్రితం ఈ వ్యాధి నుంచి బయటపడ్డా. ఇప్పుడు ఆ వ్యాధి తాలూకు లక్షణాలేవీ నాలో లేవు. దీనికి కారణం నా కుటుంబ సభ్యులందిచిన సహకారమే. ప్రస్తుతం ఆ విషయాలను గుర్తు చేసుకుంటేనే భయమేస్తోంది. అసలు నేను ఇలా ప్రవర్తించానా?’’ అని అనిపిస్తోందని చెప్పింది ఇలియానా.

To Top
error: Content is protected !!