ఆరోగ్యం

బరువు తగ్గించే చిట్కాలు..!మీ కోసం

ఈ మద్య కాలంలో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. ఇక జంగ్ ఫుడ్స్ తిన్నవారికి ఒక్కసారే ఊబకాయం బాగా వస్తుంది. ఈ ఇబ్బంది ముఖ్యంగా ఆడవారికి బాగా వస్తుంది..వయసు తో పాటు శరీర బరువు కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వెంటనే వచ్చేస్తుంది.. మీరు మరీ బరువుగా ఉన్నారా ? పది మందిలో తిరగాలంటే కాస్త బిడియంగా ఉన్నారా అయితే ఏం ఫరువాలేదు మీరు బరువు తగ్గే తరుణోపాయాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా తమలపాకులు మంచి ఔషదం గా పనిచేస్తుంది.అవునండీ తమలపాకుతో బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. జీర్ణక్రియను మెరుగుపరిచే తమలపాకును తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చును. తమలపాకు బరువు నష్టం ప్రక్రియను వేగవంతం చేసి శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు సహాయపడతుంది.
గ్యాస్ట్రిక్ ఆమ్లాల వలన వచ్చే చెడు ప్రభావాల నుండి ఉదర పూతను రక్షిస్తుంది. అలాగే తమలపాకులు, మిరియాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం. తమలపాకు చాలా శక్తివంతమైన కడుపు ఉబ్బరం లక్షణాలను పూర్తిగా తొలగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.లేత మరియు ఆకుపచ్చగా ఉన్న తమలపాకులో 5 మిరియాల గింజలను వేసి, తమలపాకును మడిచి నమలాలి. మిరియాలు ప్రారంభంలో కొంచెం కారంగా ఉండవచ్చు. అలాగే ఆకును నమిలి తినాలి. ఇలా చేయడం ద్వారా ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 8 వారాల పాటు తీసుకోవాలి. మిరియాలలో ఫ్యాతో న్యూట్రియంట్స్, పెప్పేరిన్ ఉండటం వల్ల కొవ్వు విచ్ఛిన్నంలో సహాయపడుతుంది.

To Top
error: Content is protected !!