కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
ఆరోగ్యం

ఆలుగ‌డ్డలు తింటే నిజంగానే లావ‌వుతారా..? ఇందులో నిజం ఎంత..? తెలుసుకోండి..!

healthy potato
ఆలుగ‌డ్డలు తింటే నిజంగానే లావ‌వుతారా..? ఇందులో నిజం ఎంత..? తెలుసుకోండి..!

ఆలుగ‌డ్డ‌లు. కొన్ని చోట్ల వీటిని బంగాళాదుంప అని కూడా అంటారు. అయితే ఏ పేరుతో వీటిని పిలిచినా వీటితో చేసే వంట‌కాలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. వేపుడు, కూర‌, పులుసు, వెజ్ బిర్యానీ, చిప్స్‌… ఇలా చెప్పుకుంటూ పోతే ఆలుగ‌డ్డ‌ల‌తో చేసే వంట‌కాలు అనేకం ఉన్నాయి. ఈ క్ర‌మంలో చాలా మందికి ఆలుగ‌డ్డ‌ల ప‌ట్ల కొన్ని అపోహ‌లు కూడా ఉన్నాయి. వాటిని తింటే లావ‌వుతామ‌ని, ఆరోగ్యానికి మంచివి కాద‌ని కొందరు నమ్ముతారు. అయితే అస‌లు ఈ విష‌యాలు ఇంత‌కీ నిజ‌మేనా..? వీటిలో వాస్త‌వం ఎంత ఉంది..? తెలుసుకుందాం.
ఆలుగ‌డ్డ‌ల్లో కార్బొహైడ్రేట్స్ (పిండి ప‌దార్థాలు) ఎక్కువ‌గా ఉంటాయి. అయితే అవి బియ్యం, గోధుమ‌ల్లో ఉన్న‌టువంటివి కావు. చాలా సంక్లిష్ట‌మైన కార్బొహైడ్రేట్లు. దీంతో ఇవి జీర్ణం అయ్యేందుకు స‌మ‌యం ప‌డ‌తాయి. క‌నుక వీటిని మ‌ధుమేహం ఉన్న‌వారు కూడా తిన‌వ‌చ్చు. దీంతో వారి ర‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు పెర‌గ‌వు. అయితే ప‌రిమితికి మించి మాత్రం తిన‌కూడ‌దు.ఆల‌గడ్డ‌ల‌ను చాలా మంది పొట్టు తీసేసి వండి తింటారు. కానీ అలా కాదట‌. పొట్టుతోనే వాటిని వండి తినాల‌ట‌. దీంతో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కీల‌క పోష‌కాలు అందుతాయి. ముఖ్యంగా ఫైబ‌ర్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌య్యేలా చేస్తుంది.
ఆలుగడ్డ‌ల‌ను ఎక్కువగా తింటే లావు అవుతార‌న‌డం అపోహేన‌ట‌. సాక్షాత్తూ వైద్యులే ఈ మాట‌ను చెబుతున్నారు. ఎందుకంటే ఆల‌గడ్డ‌ను వండి, బేక్ చేసి, రోస్ట్ చేసి, కాల్చి తింటే ఏం కాదు. కానీ అలా కాకుండా వేపుళ్లు, చిప్స్ లా చేసుకుని తింటే 100 శాతం ఆరోగ్యానికి ప్ర‌మాద‌మే. ఇలా తింటేనే క‌చ్చితంగా లావ‌వుతారు. అలా కాకుండా సాధార‌ణంగా వండి తింటే ఏమీ కాదు. ఆరోగ్య‌వంతులు ఎంతైనా అలా తిన‌వ‌చ్చు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!