నేషనల్

ప్రపంచంలోనే అతి పొడవైన బైక్‌ ని చూసారా?

ప్రపంచంలోనే అతి పొడవైన బైక్‌ ని చూసారా?

కుర్రకారుకి బైక్‌లంటే యమా క్రేజ్! మేఘాలలో తేలిపోతూ దూసుకుపోవావాలనుకుంటారు. అయితే ఏకంగా 13 అడుగుల పొడవైన బైక్‌ని ఎప్పుడైనా చూశారా? బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ జాకిర్ ఖాన్ 13 అడుగుల పొడవైన బైక్‌ను రూపొందించాడు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన బైక్ అని చెబుతున్నాడు. దీనికి ‘చాపర్ బైక్’ అని నామకరణం చేశాడు. ఈ 400 కిలోల బరువున్న ఈ చాపర్‌బైక్‌ను బెంగళూరులోని జేపీ నగర్‌లో ప్రదర్శనకు ఉంచాడు. ఈ సందర్భంగా జాకిర్ మాట్లాడుతూ గతంలో 10, 11 అడుగుల బైక్‌ను ఇతరులు రూపొందించారు. ఈ వన్ సీటర్ బైక్ తయారు చేసేందుకు ఏడున్నర లక్షలు ఖర్చయ్యాయని తెలిపాడు. అలాగే దీనిని రూపొందించేందుకు 45 రోజులు పట్టిందని, ఈ వాహనానికి 220 సీసీ బైక్ ఇంజిన్ అమర్చినట్లు తెలిపాడు. ఈ బైక్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందన్నాడు. కాగా బైక్‌ను తీర్చిదిద్దే విషయంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యానని, అయినా సరే ఎట్టకేలకు విజయం సాధించానని తెలిపాడు.

To Top
error: Content is protected !!