తెలంగాణ

తెలంగాణాలో భూ సమస్యలకు ఇక ఫుల్ స్టాప్ !

Full Stop for Land Issues in Telangana
తెలంగాణాలో భూ సమస్యలకు ఇక ఫుల్ స్టాప్ !

దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో భూపట్టాల సమస్య ఒకటి . తెలంగాణాలో ఈ సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తుంది .. దీనికి పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం రెవిన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది . అయితే అంతకంటే ముందే పలు జిల్లాల్లో ‘మీ భూమి -మీ పత్రాలు’ పేరుతో వినూత్న కార్యక్రమానికి రెవిన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది.. మొదటగా మేడ్చల్ జిల్లా కీసర డివిజన్ లో ‘మీ భూమి -మీ పత్రాలు’ పేరుతో దీనిని మొదలు పెట్టారు. కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది ..ప్రస్తుతం తెలంగాణలోని పలు రెవిన్యూ డివిజన్లలో ‘మీ భూమి -మీ పత్రాలు కార్యక్రమం ద్వారా భూ సమస్యలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు .

2017 సెప్టెంబర్ లో రైతుల భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూ సమస్యల పరిష్కారానికి కృషి చేసింది .అయితే సాంకేతిక సమస్యలు ,మార్గదర్శక లోపాల వలన కొన్ని సమస్యలు అలానే మిగిలిపోయాయి .ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ‘మీ భూమి -మీ పత్రాలు’ వినూత్న కార్యక్రమం చేపట్టారు .మొదట కీసర రెవిన్యూ డివిజన్ లోని ఆరు మండలాల్లో భూ సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా వ్యూహాలు రచించి వాటిని అమలు చేశారు . ఏప్రిల్ 30 మంగళవారం నాటికి 12 గ్రామాలను భూసమస్యలు లేని గ్రామాలుగా రెవిన్యూ అధికారులు ప్రకటించారు .ఇదే స్పూర్తితో తెలంగాణ అంతటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు .

ఏప్రిల్ 25 నుంచి మే 7 వరకు పదిరోజుల పాటు రోజుకి రెండు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు .దీని ద్వారా భూసమస్యలు ఉన్న రైతులు ..వారివద్ద ఉన్న పత్రాలు తీసుకువచ్చి భూ సమస్యను పరిష్కరించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు . రైతు సమస్యలు తెలుసుకొని వారి వద్ద ఉన్న పత్రాలు సరిచేసుకొని చట్టప్రకారం వారి సమస్యలను వెంటనే పరిష్కరించారు. కుటుంబ సభ్యులు , బంధువుల మధ్య ఉన్న సమస్యలు కూడా వారిమధ్య ఉండే సయోధ్య ఆధారంగా పరిష్కరించగలిగారు .ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి దాదాపుగా తగ్గిపోతుంది .

మీ భూమి -మీ పత్రాలు’ కార్యక్రమం ఎక్కడ సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక బద్దంగా కొనసాగుతుంది . మండలాల వారీగా ఉద్యోగులకు ముందుగానే పని విభజన చేసి ఎన్ని అర్జీలు వచ్చాయి , ఏ సమస్యలు వచ్చాయి ,ఎన్ని పరిష్కరంచగలిగారు , ఎన్ని పరిష్కరించలేకపోయారు వంటి డేటాను ఏ రోజుకారోజు రూపొందించి పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు . ముఖ్యంగా రెవిన్యూ ఉద్యోగులపై వస్తున్న అపోహలను తొలగిస్తూ ..రైతులకు భూసమస్యలు లేకుండా చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని సఫలం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు .మండలాల వారీగా తహసీల్దార్లకు పలు సూచనలు చేసి ఏ రోజు ఏ గ్రామంలో కార్యక్రమం నిర్వహించాలో కూడా సూచించి ..

కార్యక్రమాన్ని డివిజన్ అధికారి స్వయంగా సమన్వయము చేసుకుంటూ విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు .ఇక తహసీల్దార్లు కూడా తమ తమ మండలంలో చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు .వీరితో పాటు విఆర్వో , విఆర్ ఏ, ఇతర రెవిన్యూ సిబంది కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు ..

To Top
error: Content is protected !!