క్రీడలు

మరోసారి చిక్కుల్లో పడ్డ క్రికెటర్లు!

సుప్రీం కోర్టు ఊరటనిచ్చినా క్రికెటర్లు పాండ్యా ,కేఎల్ రాహుల్ లను కేసు వదలడం లేదు.‘కాఫీ విత్ కరణ్ టాక్ షో’ లో భారత క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా ,కేఎల్ రాహుల్ లు పాల్గొని మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో పాండ్యా, రాహుల్ పై కేసులు నమోదయ్యాయి. బీసీసీఐ వీరిద్దరిపై క్రికెట్ ఆడకుండా తాత్కాలిక నిషేధం విధించింది. కేసు సుప్రీం కోర్టు వరకూ వెళ్లి వారికి ఊరట లభించింది. ప్రస్తుతం పాండ్యా భారత్ క్రికెట్ జట్టు తరుఫున న్యూజిలాండ్ లో ఆడుతున్నారు.

అయితే తాజాగా పాండ్యా ,రాహుల్ తో పాటు షో నిర్వాహకుడు కరణ్ జోహర్ పై జోధ్ పూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ ఐ) తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు తెలియజేసింది. రాజస్థాన్ కు చెందిన డీఆర్ మెఘవాల్ అనే వ్యక్తి జోధ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా జోధ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం పాండ్యా ఆస్ట్రేలియా న్యూజిల్యాండ్ పర్యటనలో భారత జట్టు తరుఫున విశేషంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ బౌలింగ్ లో పూర్వపు ఫామ్ తో ఆకట్టుకున్నాడు. వివాదాలు చెలరేగినా చెక్కు చెదరకుండా ఆడుతున్నాడు. మరో వైపు కేఎల్ రాహుల్ సైతం ఇండియా ఏ జట్టు తరుఫున ఇంగ్లండ్ బ్లూ జట్టుతో ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ముగిసిపోయిందనుకుంటున్న వివాదం మళ్లీ కేసు నమోదు.. కోర్టుకు చేరడంతో క్రికెటర్లకు మరోసారి చిక్కులు తప్పేలా లేవు.

To Top
error: Content is protected !!