ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వం ఫ్రీ పథకం!

free medicines for BP and sugar patients in andhra pradesh
ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వం ఫ్రీ పథకం!

మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడే రోగులకు ఏపీ ప్రభత్వం శుభవార్త తెలిపింది. ఇకపై రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో బీపీ, షుగర్‌ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసేందుకు, ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఉచిత మందుల పథకాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.. ఈ పథకం కింద నెలకు సరిపడా మందులు ఒకేసారి పొందవచ్చు.

రాష్ట్రంలో ఏ ప్రైవేటు రిటైల్‌ మెడికల్‌ షాపుల్లోనైనా, రోగులు ఈ మందులు పొందే వెసులుబాటు కల్పించారు. బీపీ, షుగర్‌ రోగులపై ఆర్థిక భారం పడకుండా సంరక్షించేందుకు, ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నెలకు వేల రూపాయలు చెల్లించి , బీపీ, షుగర్‌ మందులు కొనుగోలు చేసే రోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నట్లు గుర్తించారు.

వారికి ఉచితంగా మందులు ఇవ్వడం ద్వారా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని సిఫార్సు చేశారు సర్వ్ చేసిన కమిటీ వారు . ఈ ప్రతిపాదనను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రభుత్వానికి పంపగా, ఆమోదం లభించింది.పథకంలో చేరిక ఎలా అంటే … ఉచిత మందుల పథకంలో లబ్ధిదారులుగా చేరదలచిన రోగులు, తొలుత తమకు ఉన్న బీపీ, షుగర్‌ వ్యాధులను సమీపంలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో, నిర్ధారణ చేయించుకోవాలి.

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రుల్లో, డాక్టర్లు ఈ జబ్బులను నిర్ధారించాలి. ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు , ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వైద్యులు కూడా ఈ వ్యాధులను నిర్ధారించవచ్చు. బీపీ పరీక్షలతో పాటు, షుగర్‌ పరీక్షలు కూడా చేయించుకోవాలి.

షుగర్‌ రోగులు ఫాస్టింగ్‌, పోస్ట్‌ ప్రాండియల్‌ పరీక్షలతో వ్యాధిని నిర్ధారించాలి. అనంతరం డాక్టర్‌ రోగి పరీక్ష ఫలితాలను, AP-eRX APP ద్వారా, అప్‌లోడ్‌ చేస్తారు. వెంటనే రోగి సెల్‌ఫోన్‌ నెంబర్‌కు, కోడ్‌ వస్తుంది. అంతే రోగి లబ్ధిదారుడుగా ఎంపికైనట్లే. ఈ కోడ్‌ను చూపి రిటైల్‌ మెడికల్‌ షాపునకు వెళ్లి మందులు కొనుగోలు చేసుకోవచ్చు. ఒకసారి నెలకు సరిపడా మందులు ఇస్తారు.

రోగులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చేందుకు వారి ఆధార్‌ నెంబర్‌, ప్రజాసాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. ప్రజా సాధికార సర్వేలో నమోదు కానివారు తమ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో సంప్రదించాలి. మెడికల్ షాప్ ఓనర్స్ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా …. జిల్లాలో రిటైల్‌ మందుల దుకాణదారులు షుగర్‌, బీపీ మందులు విక్రయించేందుకు తొలుత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఇందుకోసం ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌ను ఓపెన్‌ చేయాలి. దానిలో AP-eRX for pharmacy, అని టైప్‌ చేయాలి. వెంటనే ఇన్‌స్టాల్‌ బటన్‌ వస్తుంది. దానిని క్లిక్‌ చేస్తే ఇన్‌స్టాల్‌ అయ్యి నెంబర్‌, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. నెంబర్‌, పాస్‌వర్డ్‌ ఇచ్చి, రిజిస్టర్‌ అనే పదాన్ని క్లిక్‌ చేస్తే పూర్తి చేయాల్సిన దరఖాస్తు వస్తుంది. దరఖాస్తు పూర్తి చేయాలి. అనంతరం సబ్మిట్‌ బటన్‌ నొక్కితే, ఓటీపీ వస్తుంది. ఈ నెంబర్‌ను ఎంటర్‌ చేసి సెండ్‌, మరియు ఓకే చేయాలి. వెంటనే రిటైల్‌ షాపు రిజిస్టర్‌ అవుతుంది. ఈ పథకం వలన బాధితులకు ఎంతో మేలు కలగనుంది.

To Top
error: Content is protected !!