ఆరోగ్యం

ఉదయాన్నే లేచిన వెంటనే ఇవి తప్పక చేయండి!

follow this tips early morning for good and healthy life
ఉదయాన్నే లేచిన వెంటనే ఇవి తప్పక చేయండి!

మ‌న‌లో చాలా మంది ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ముందుగా ఫోన్ చెక్ చేస్తారు. సోష‌ల్ మీడియాలో ఏం పోస్టులు వ‌చ్చాయో చూసుకుంటారు. ఆ త‌రువాత కొంద‌రు యథావిధిగా త‌మ త‌మ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభిస్తారు. అయితే నిత్యం ఉద‌యాన్నే నిద్ర‌లేవ‌గానే ఎవ‌రైనా కింద తెలిపిన విధంగా కార్య‌క్ర‌మాలు ప్రారంభించాలి. దీంతో ఆరోగ్య‌వంత‌మైన జీవితం సొంత‌మ‌వుతుంది. అలాగే రోజూ ఉత్సాహంగా ఉంటారు. 

1. ఉద‌యం నిద్ర లేవ‌గానే ఫోన్లు, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్ల‌కు దూరంగా ఉండాలి. ఇవి మ‌న మూడ్‌ను మారుస్తాయి. క‌నుక ఉద‌యం వాటిని ఉప‌యోగించ‌కూడ‌దు. 

2. నిద్ర‌లేవ‌గానే ఏదైనా ఒక జోక్ చ‌ద‌వండి. త‌రువాత మీ ముఖాన్ని అద్దంలో 20 సెకన్ల పాటు చూసుకుని న‌వ్వుకోండి. 

3. నిద్ర‌లేవ‌గానే ఇంట్లో అంద‌రికీ, కుదిరితే ఇరుగు పొరుగున ఉండే వారికి గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇది మీ మూడ్‌ను ఉత్సాహంగా మారుస్తుంది. 

4. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని కూర్చొని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియ మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది.

5. రిలాక్సేషన్‌ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే మంచిది. దీంతో శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కి పోయి, శ‌రీరం డిటాక్స్ అవుతుంది. 

6. పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్, ప్రోటీన్స్ వ్యాధి నిరోధకతను పెంచి, శరీరాన్ని స్ట్రాంగ్‌గా, ఫిట్‌ గా ఉంచుతాయి. మనకు శ‌క్తిని ఇస్తాయి. ముఖ్యంగా పండ్ల‌ను ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని అవి యాక్టివ్‌గా ఉంచుతాయి.

7. ప్రతీ రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కోవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది.

8. నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయడం మీ అలవాట్లో లేకపోతే, ఆ అలవాటును అలవరుచుకోండి.
రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మీకు నచ్చిన సంగీతాన్ని చాలా త‌క్కువ సౌండ్‌తో వినండి. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్‌ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది. 

To Top
error: Content is protected !!