క్రీడలు

స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌,కశ్యప్‌ల పెళ్లి ?

fans want to marry saina nehwal and sunil kashyap
స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌,కశ్యప్‌ల పెళ్లి ?

స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ ఎన్నాళ్లుగానో పుకార్లు వస్తున్నాయి. అయితే, వీటిని నిజం చేయాలంటూ ఆ ఇద్దరినీ అభిమానులు కోరుతున్నారు. అభిమానులు ఇంతలా రెస్పాండ్‌ కావడానికి కారణం లేకపోలేదు! ఇటీవల హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్లో కశ్య్‌పతో కలిసి దిగిన ఫొటోను సైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అయితే ఈ ఫొటో వైరల్‌గా మారడంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట్లో కామెంట్లు వెల్లువెత్తాయి. ‘ఇద్దరిదీ పర్‌ఫెక్ట్‌ జోడీ’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘చూడ్డానికి చక్కగా ఉన్నారు.. డేటింగ్‌ వార్తలను నిజం చేయండి.. ప్లీజ్‌’ అంటూ మరొకరు.. ‘ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో చాలామంది జంటలుగా మారారు, మీరూ వాళ్లను అనుసరించండి’ అంటూ ఇంకొకరు సూచించారు. మరి.. అభిమానుల కోరికను సైనా, కశ్యప్‌ నిజం చేస్తారా..? చూడాలి.

To Top
error: Content is protected !!