ఎడ్యుకేషన్

తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు ఇవాళ‌ విడుద‌ల‌!

తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు ఇవాళ‌ విడుద‌ల‌!

రాష్ట్రంలోని వివిధ ఇంజ‌నీరింగ్ సీట్ల భ‌ర్తీ కోసం నిర్వ‌హించ‌ని ఎంసెట్ ఫలితాలు ఇవాళ‌ విడుదల కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నాం JNTUHలో విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. ఈ పరీక్షలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 2 ల‌క్ష‌ల 20 వేల 248 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇంజినీరింగ్ కోసం 1 ల‌క్ష 41 వేల 190 మంది దరఖాస్తు చేసుకున్నార‌ని.. అందులో 1 ల‌క్ష 31 వేల 910 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 79 వేల 61 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 73 వేల 501 మంది హాజరయ్యారని కన్వీనర్ యాద‌య్య‌ తెలిపారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 12న ఈ ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించామ‌న్నారు. ఫ‌లితాల కోసం అధికారిక వైబ్ సైట్  eamcet.tsche.ac.in లో తెలుసుకోవ‌చ్చ‌న్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!