ఎడ్యుకేషన్

పిల్లలకు హోంవర్క్‌ ఏమిచ్చారో తెలిస్తే ఆ టీచర్ ను మీరు కూడా తంతారు…!!

suicide note as homework
పిల్లలకు హోంవర్క్‌ ఏమిచ్చారో తెలిస్తే ఆ టీచర్ ను మీరు కూడా తంతారు...!!

బ్రిటన్‌లో ఓ స్కూల్‌ చిన్నారులకు ఓ ఇంటిపని అప్పగించి అవాక్కయ్యేలా చేసింది. వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. సాధరణంగా ఇంటిపని అంటే పుస్తకంలోని ఏవో కొన్ని పాఠాలు చెప్పి అందులో మరికొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకుండా స్వయంగా తెలుసుకొని రావాలని ఉపాధ్యాయులు ఆదేశిస్తారు. లేదంటే ఏవైనా కొన్ని బొమ్మలు గీసుకొని రమ్మనో లేకుంటే వ్యాసాలు రాయాలనో చెప్తారు.
కానీ, ఆ స్కూల్‌ మాత్రం బిత్తరపోయేలా ఆత్మహత్య లేఖను రాసుకొని రావాలని చెప్పింది. ఈ ఘనకార్యం చేసింది ఓ ఆంగ్ల టీచర్‌. మొత్తం 60మంది విద్యార్థులకు ఈ సూసైడ్‌ నోట్‌ డ్రాఫ్ట్‌లను తీసుకురావాలని చెప్పింది. షేక్‌స్పియర్‌ విషాదాంత రచన మ్యాక్‌బెత్‌లో భాగంగా ఈ లేఖ నమునాను తీసుకురావాలని ఆదేశించింది. దీనిపై తల్లిదండ్రులంతా భగ్గుమనడంతో చివరకు ఆమె క్షమాపణలు చెప్పింది. లండన్‌లోని కిడ్‌బ్రోక్‌లో గల థామస్‌ తల్లీస్‌ స్కూల్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా, ఇలాంటివి కూడా విద్యార్థులకు అవసరం అని మరికొందరు తల్లిదండ్రులు మద్దతిచ్చారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!