ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
ఎడిటోరియల్

నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోయారో మీరు ప్రమాదంలో ఉన్నట్లే…!!

precautions for net banking users
నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోయారో మీరు ప్రమాదంలో ఉన్నట్లే...!!

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు..ప్రపంచం మీచేతిలో ఉన్నట్లే…ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఈ స్మార్ట్ ఫోన్ కారణంగా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.. ఇంటర్నెట్ ఉంటే చాలు…ఆన్ లైన్ బ్యాంకింగ్..మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించి లావాదేవీలన్నీ క్షణాల్లో పూర్తిచేయొచ్చు.. ఇందుకోసం ప్రతీ బ్యాంకు కు ఓ సొంత యాప్ ఉంది..దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి.. అంతా బాగానే ఉంది..కానీ హ్యాకర్ల నుంచే ప్రమాదం పొంచి ఉంది.ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా..మీ ఖాతా ఖాళీ అయిపోవడం ఖాయం..

రకరకాల ఎత్తుగడలతో హ్యాకర్లు మీ బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోగలుగుతున్నారు.. అయితే వన్ టైమ్ పాస్ వర్ట్ వల్ల హ్యాకర్ల పప్పులేమీ ఉడకడం లేదు..కానీ దాన్నీ ఇప్పుడు హ్యాకర్లు ఛేదిస్తున్నారు..ముందు ఖాతాదారుని సమాచారాన్ని దొంగిలిస్తున్నారు..ఆ తర్వాత ఓ కొత్త సిమ్ తీసుకుంటున్నారు..సిమ్ నెట్ వర్క్ కంపెనీ సూచనలతో వినియోగదారులకు కాల్ చేసి కొంతసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని కోరతారు.. వినియోగదారులు అలా చేయగానే దుండగుల సిమ్ యాక్టివేట్ అవుతుంది.. కస్టమర్ నెంబర్ ఈ కొత్త సిమ్ కార్డు మీదకు స్వాప్ అవుతుంది.. అలా స్వాప్ అయిన వెంటనే సిమ్ కార్డుకు వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేసి మీ ఎకౌంట్ లో ఉన్న డబ్బంతా కొట్టేస్తారు..కాబట్టి కొన్ని మెలకువలు పాటించకపోతే మీ ఎకౌంటులోని డబ్బంతా క్షణాల్లో మాయమైపోతుంది..

మీ బ్యాంక్ వివ‌రాల‌ను తెలియ‌జేయ‌మ‌ని వ‌చ్చే కాల్స్‌, ఈ-మెయిల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌కు స్పందించ‌వ‌ద్దు. ఎందుకంటే బ్యాంకు వారు ఎప్పుడూ అలా అడ‌గ‌రు. ఆన్‌లైన్‌, మొబైల్ బ్యాంకింగ్‌ ల‌కు వాడే ఈ-మెయిల్స్‌, ఫోన్ నంబ‌ర్ల‌ను ఎవ‌రికీ చెప్ప‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం. ఆన్‌ లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వ‌హించాలంటే స‌ద‌రు బ్యాంక్ వెబ్‌ సైట్‌ను ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ లో టైప్ చేసి మాత్ర‌మే ఓపెన్ చేయాలి. వేరే వెబ్ సీట్లలో ఉండే లింకుల ద్వారా ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ స‌మాచారం ఇత‌రుల చేతుల్లోకి వెళ్లే అవ‌కాశం ఉంటుంది. మొబైల్‌, ఆన్‌ లైన్ బ్యాంకింగ్ పాస్‌వ‌ర్డ్‌ ల‌ను కనీసం 3 నెల‌ల‌కు ఒక‌సారి అయినా మారుస్తుండాలి.

ఎవ‌రైనా మీ ఫోన్ నెట్‌వ‌ర్క్ బాగాలేదు, ఫోన్‌ ను ఒక‌సారి స్విచ్ ఆఫ్ చేయండి అని చెబితే వెంట‌నే జాగ్ర‌త్త ప‌డండి. ఒక వేళ అలాంటి ఫోన్ కాల్స్ క‌న‌క వ‌స్తే అప్పుడు మీ మొబైల్‌, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ల‌ను లాక్ చేయండి. లేదంటే పాస్‌ వ‌ర్డ్‌ లు, ఈ-మెయిల్స్‌, మొబైల్ నంబ‌ర్స్‌ ను మార్చండి. మీ బ్యాంక్ లావాదేవీల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచండి. ఎప్ప‌టిక‌ప్పుడు స్టేట్‌ మెంట్స్ చూసుకోండి. బ్యాంక్ లేదా మొబైల్ సేవ‌ల‌కు సంబంధించి ఎలాంటి అంత‌రాయాన్న‌యినా మీరు గ‌మ‌నించిన‌ట్ట‌యితే వెంట‌నే స‌ద‌రు కంపెనీని సంప్ర‌దించి వివ‌రాలు తెలుసుకోండి.

ఈ విలువైన సమాచారాన్ని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి ఘరానా మోసాలనుండి వారిని కూడా కాపాడండి. కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానెల్…

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!