ఎడిటోరియల్

స్మార్ట్‌ఫోన్లు పేలడం వెనుక కారణం తెలిసింది.. !!

cell phone exploded while charging
స్మార్ట్‌ఫోన్లు పేలడం వెనుక కారణం తెలిసింది.. !!

స్మార్ట్ ఫోన్…ఎప్పుడు పేలుతుందో..తెలీని పరిస్థితి.. ఛార్జింగులో పెట్టిన స్మార్ట్ ఫోన్ పేలిపోవడం అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. అందుకే ఇకపై ఛార్జింగ్ పెట్టే సమయంలో కరెంట్ షాక్ కొట్టకుండా ఉండేవిధంగా పలు మార్పులు చేస్తున్నాయి కంపెనీలు.. స్మార్ట్ ఫోన్ కొనే ప్రతీ ఒక్కరికీ ఫైర్ ప్రూఫ్ టూట్స్ కూడా అందించనున్నాయి కొన్ని కంపెనీలు.. అయితే ఇలా ఫోన్లు ఎందుకు పేలుతున్నాయనేది ఇప్పటిదాకా ఎవరికీ అర్థం కాని విషయం..చీప్ ఫోన్లు..చైనా ఫోన్లు పేలిపోయాయని అనుకునేవారు..అయితే ఈ మధ్య కాలంలో ప్రతీ ఫోన్ పేలుతుండటంతో దీని వెనుకున్న కారణాన్ని వివరించారు ఓ గూగుల్ ఇంజనీర్.. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఛార్జర్లను రెండు రకాలుగా పని చేసేలా తయారుచేస్తున్నారు..ఒకటి త్వరగా ఛార్జింగ్ అవడానికి..రెండు యుఎస్బీ కనెక్టెర్ కేబుల్ గా ఉపయోగపడటానికి వీలుగా… అయితే ఇలా ఒకే కేబుల్ ను రెండు విధాలుగా వాడటం అసాధ్యం అని తేల్చారు.. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదట.. అందువల్లే స్మార్ట్ ఫోన్లు పేలుతున్నాయని గూగుల్ ఇంజనీర్ బెన్ సన్ లీయుంగ్ తేల్చారు..ఇకనైనా సెల్ ఫోన్ కంపెనీలు మేల్కొని ఇలా రెండు విధాలా ఉపయోగపడేలా కాకుండా కేవలం ఛార్జింగ్ పర్పస్ లోనే ఛార్జర్ తయారు చేయాలని సూచిస్తున్నారు..ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి..

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!